గజ్వేల్లో ‘డబుల్’ ఇండ్ల కేటాయింపు షురూ..

గజ్వేల్లో ‘డబుల్’ ఇండ్ల కేటాయింపు షురూ..
  • మల్లన్నసాగర్​ నిర్వాసితులను ఖాళీ చేయించిన ఆఫీసర్లు

గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లా గజ్వేల్  ప్రజ్ఞాపూర్​ మున్సిపాలిటీలోని డబుల్​ ఇండ్లలో తాత్కాలికంగా ఉంటున్న మల్లన్నసాగర్​ నిర్వాసితులను అధికారులు ఖాళీ చేయించి, లబ్ధిదారులకు అందజేశారు. శుక్రవారం రెవెన్యూ, మున్సిపల్, పోలీస్​ అధికారులు గజ్వేల్- ప్రజ్ఞాపూర్​ డబుల్​ బెడ్రూం కాలనీలో 15 ఇండ్లను ఖాళీ చేయించారు. వాటిని గతంలో లాటరీ ద్వారా కేటాయించిన లబ్ధిదారులకు అందజేశారు. ఇలా ఇప్పటి వరకు 49 మందికి అందజేసినట్లు ఆర్ఐ​జి కృష్ణ తెలిపారు.

మల్లన్న సాగర్  ముంపు నిర్వాసితులను తరలించే సమయంలో ఇండ్ల ప్యాకేజీ తీసుకోని వారికి తాత్కాలికంగా ఇక్కడ ఇండ్లను కేటాయించారు. వీరికి ఇంటి స్థలాలు ఇవ్వడంతో వారు ఇండ్లు నిర్మించుకొని వెళ్లిపోయినప్పటికీ, ‘డబుల్’​ఇండ్లను ఖాళీ చేయకుండా తాళాలు వేసుకున్నారు. ప్రస్తుతం అలాంటి ఇండ్లను గుర్తించి అధికారులు ఖాళీ చేయించి లబ్ధిదారులకు అందిస్తున్నారు. 255 ఇండ్లను ఖాళీ చేయించాల్సి ఉందని అధికారులు తెలిపారు.