పంద్రాగస్టుకు ముస్తాబైతున్న గోల్కొండ కోట: డీసీపీ కిరణ్ కరే

పంద్రాగస్టుకు ముస్తాబైతున్న గోల్కొండ కోట: డీసీపీ కిరణ్ కరే

మెహిదీపట్నం, వెలుగు: పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబవుతోంది. కోటలో జరుగుతున్న పనులను వివిధ శాఖల అధికారులతో కలిసి గురువారం సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్​ కరే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం కేటాయించిన స్థలంలోనే ఆటపాటలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. 

పంద్రాగస్టు వేడుకలకు వచ్చే జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీటి వసతి, మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేయాలన్నారు. పాసులున్న వారిని మాత్రమే లోపలికి అనుమతించాలన్నారు. గోల్కొండ కోటకు చేరుకునే మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా సైన్ బోర్డులను పెట్టాలన్నారు. ఈ విషయమై ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్ సుధాకర్​తో డీసీపీ కిరణ్ చర్చించారు.