కొమురవెల్లి, వెలుగు: పోక్సో కేసు నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 2 లక్షల జరిమానా విధిస్తూ సిద్దిపేట డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జి జయప్రసాద్ బుధవారం తీర్పు ఇచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేటకు చెందిన దూదేకుల షరిఫుద్దీన్ 2024 జూలైలో బాలిక ఇంట్లోకి వెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలు తండ్రి ఫిర్యాదుతో కొమురవెల్లి ఎస్ఐ ఎల్.రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా నిందితుడు షరీఫుద్దీన్ కు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. అదేవిధంగా బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కేసు ఇన్వెస్టిగేషన్ పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు.
