
హైదరాబాద్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ OG సినిమా రిలీజ్ సందడి మొదలైంది. బుధవారం ( సెప్టెంబర్ 24) రాత్రి 10 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్లలో OG ప్రీమియర్ షో ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. థీయేటర్ల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు నిర్వాహకులు.
ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ నటించిన OG సినిమా ప్రీమియర్ షో ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. బుధవారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్లలో సినిమా ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. ఈ షోకు కేవలం టికెట్ ఉన్న వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని పోలీసులు ప్రకటించారు. ఎలాంటి సంబరాలు, ప్రత్యేక కార్యక్రమాలు లేవని పోలీసులు స్పష్టం చేయడంతో నిరాశ చెందారు పవన్ కళ్యాణ్ అభిమానులు.
మరోవైపు OG సినిమా విడుదల సందర్భంగా కూకట్‌పల్లి కేపీహెచ్ బీ కాలనీలోని థియేటర్ల దగ్గర పవన కళ్యాన్ అభిమానులు సంబురాలు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ల దగ్గర పెద్ద ఎత్తున గుమికూడి, డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ, బాణాసంచా కాలుస్తూ సందడి చేశారు. థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.
►ALSO READ | Pawan Kalyan : 'OG: ది ఫస్ట్ బ్లడ్' కామిక్ రిలీజ్.. ప్రీమియర్ షోల ముందే షాక్ ఇచ్చిన సుజీత్