ఫిబ్రవరిలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గింపు : ఆయిల్ కంపెనీలకు 75 వేల కోట్ల లాభం..

ఫిబ్రవరిలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గింపు : ఆయిల్ కంపెనీలకు 75 వేల కోట్ల లాభం..

పెట్రోల్ రేట్లు తగ్గుతాయా లేదా.. కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం.. దీనికి కారణం లేకపోలేదు.. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. ఇదే సమయంలో దేశంలోని మూడు ప్రధానమైన ఆయిల్ కంపెనీలు అయిన ఐవోసీ. హెచ్ పీ, బీపీఎల్ కంపెనీలు ఏకంగా 75 వేల కోట్ల రూపాయల లాభాన్ని చూశాయి.. ఏడాది కాలంగా పెట్రోల్ రేట్లు స్థిరంగా ఉన్నాయి.. ఎలాంటి మార్పులు చేయలేదు.. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా.. మన దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం తగ్గించలేదు ఆయిల్ కంపెనీలు. 

ఆయిల్ కంపెనీలు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా.. ధరలు తగ్గించకపోవటంపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టబోతున్నారంట. బడ్జెట్ సమావేశాలు తర్వాత.. అంటే ఫిబ్రవరిలో విడుదల అయ్యే క్వార్టర్ రిజల్ట్స్ ప్రకటన తర్వాత.. ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలనే ఆలోచన చేస్తున్నాయంట.. 2023, డిసెంబర్ నెలలోనూ ఇలాంటి ప్రచారమే జరిగినా.. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి స్వయంగా ఖండించారు. ధరలు నియంత్రణ అనేది కేంద్రం పరిధిలో లేదని.. ఆయిల్ కంపెనీల చేతుల్లో ఉందని వెల్లడించారాయన. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ఎన్నికలకు ముందు పెట్రోల్ రేట్లు తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి..

ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత.. అంటే మరో 20 రోజుల్లో పెట్రోల్ పై ఐదు రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలు తగ్గింపు ఉంటుందని ఖరాఖండిగా చెబుతున్నాయంట ఆయిల్ కంపెనీలు. 2022, మే 21వ తేదీన భారతదేశంలో చివరిసారిగా రేట్లు మారాయి.. అప్పటి నుంచి స్థిరంగా ఉన్నాయి. మరో వైపు నిత్యావసర ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంధన ధరలు తగ్గించటం ద్వారా.. ధరలను కట్టడి చేయాలని కేంద్రంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆలోచన చేస్తుంది. ఆయిల్ కంపెనీలు ఆల్ రెడీ 75 వేల కోట్ల రూపాయల లాభాల్లో ఉన్నాయి.. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉండటంతో.. ఈ సారి పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగానే తగ్గించాలనే ఆలోచన చేస్తున్నాయంట ఆయిల్ కంపెనీలు.. ఈ తగ్గింపు పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలు ఉండనుంది అనేది సమాచారం..