ఆర్నెళ్లు ఓలా క్యాబ్ లు బ్యాన్

ఆర్నెళ్లు ఓలా క్యాబ్ లు బ్యాన్

ప్రముఖ క్యాబ్ సర్వీస్ ఓలాకు ఎదురు దెబ్బ తగిలింది.  నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారంటూ ఓలా క్యాబ్ సర్వీసులను ఆరు నెలల పాటు కర్ణాటక ప్రభుత్వం నిషేదించింది. బెంగళురులో వెంటనే సర్వీసులను నిలిపి వేయాలంటూ లైసెన్స్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కర్ణాటకలో టూ వీలర్ బైక్ ట్యాక్స్  నిషేదం. అయితే ఓలా సంస్థ రూల్స్ ను బ్రేక్ చేస్తూ టూ వీలర్ బైక్ ట్యాక్స్ ను  నడుపుతుంది.  అందుకే  ఓలా క్యాబ్ సర్వీసులన్నింటిని  ప్రభుత్వం ఆరు నెలల పాటు నిషేదించింది.  ఎలాంటి అనుమతులు లేకుండా రూల్స్ బ్రేక్ చేస్తూ వాహనాలు నడుపుతున్నారని  తెలిపింది.  రూల్స్ బ్రేక్ పై ఓలా సంస్థ ఇచ్చిన వివరణ సంతృప్తిగా లేనందునే రవాణా చట్టం 2016 ప్రకారం  లైసెన్స్ ను రద్దు చేస్తున్నట్లు ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ వీపీ ఇక్కేరి చెప్పారు. ఈ నెల 18నే ఉత్తర్వులు జారీ చేశామని.. ఆర్డర్ కాపీ అందిన తర్వాత మూడు రోజుల్లో ఓలా లైసెన్స్ ను సరెండర్ చేయాలని చెప్పినట్లు తెలిపారు.