చార్జింగ్​ నెట్​వర్క్​ను పెంచనున్న ఓలా

చార్జింగ్​ నెట్​వర్క్​ను పెంచనున్న ఓలా

హైదరాబాద్​, వెలుగు: ఎలక్ట్రిక్​ వెహికల్స్​(ఈవీ) వాడకాన్ని మరింత పెంచడంలో భాగంగా వచ్చే క్వార్టర్​ నాటికి ఫాస్ట్ చార్జింగ్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వేగంగా 10 వేల పాయింట్లకు పెంచుతామని ఓలా ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్​నాటికి సర్వీసింగ్​సెంటర్ల సంఖ్యను 414  నుంచి 600లకు పెంచుతామని  తెలిపింది.

అదనంగా,  ఓలా 3కిలో వాట్​ పోర్టబుల్ ఫాస్ట్ ఛార్జర్​ను కూడా లాంచ్​ చేసింది. దీని ధర రూ.30 వేలు. అంతేగాక శక్తివంతమైన 6కిలోవాట్​ మోటార్,  190 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఎస్​1ఎక్స్​ఈవీని కూడా ఓలా లాంచ్​ చేసింది. దీని ధర రూ. 1,09,999.