ఓలా సొంత బ్యాటరీతో ఎస్‌‌‌‌1 ప్రో ప్లస్ బండ్లు

ఓలా సొంత బ్యాటరీతో ఎస్‌‌‌‌1 ప్రో ప్లస్  బండ్లు

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా తమ ఫ్లాగ్‌‌‌‌షిప్ స్టోర్లలో ‘4680 భారత్ సెల్‌‌‌‌’ ను అమర్చిన బండ్ల  టెస్ట్ రైడ్స్ ప్రారంభించామని ఓలా ఎలక్ట్రిక్ ఆదివారం (నవంబర్ 16) ప్రకటించింది. కంపెనీ స్వదేశీగా తయారు చేసిన 5.2 కిలోవాట్‌‌‌‌అవర్‌‌‌‌‌‌‌‌ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌‌‌‌ను  ఎస్‌‌‌‌1 ప్రో ప్లస్‌ బండ్లలో వాడి టెస్ట్ డ్రైవ్‌‌‌‌ మొదలు పెట్టింది . 

ఇది ఎక్కువ రేంజ్, మెరుగైన పనితీరు, సేఫ్టీ అందిస్తుందని ఓలా తెలిపింది. ఇటీవలే ఈ బ్యాటరీ ప్యాక్‌‌‌‌లు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా ఏఐఎస్‌‌‌‌156 అమెండ్‌‌‌‌మెంట్ 4 ప్రమాణాల ప్రకారం ఏఆర్‌‌‌‌‌‌‌‌ఏఐ సర్టిఫికేషన్ పొందాయి.  ఈ బ్యాటరీతో బండ్ల పనితీరు, రేంజ్, భద్రత మెరుగవుతుందని ఓలా తెలిపంది.