
పుణెలో స్క్రాప్ బస్సులను లేడీస్ వాష్ రూములుగా ఉపయోగిస్తున్నారు. నగరపాలక సంస్థ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో పాత బస్సులను ఇలా వాడకంలోకి తీసుకొచ్చారు. దీంతో మహిళలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా రద్దీ రోడ్లపై ఇలా పాత బస్సులను టాయిలెట్ల కోసం ఏర్పాటు చేస్తున్నారు. పుణెలో ఇలాంటి బస్సులు 20కి పైగా ఉన్నాయి.