సంగారెడ్డి జిల్లాలో ముగిసిన పాతపంటల జాతర

సంగారెడ్డి జిల్లాలో ముగిసిన పాతపంటల జాతర

ఝరాసంగం, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని మాచునూర్​ గ్రామ శివారులో ఉన్న  డక్కన్​ డెవలప్​మెంట్​ సొసైటీ  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 24 వ పాతపంటల జాతర ముగిసింది. సంక్రాంతి సందర్భంగా మొగుడంపల్లి మండలం జాడిమల్కాపూర్ లో​ ప్రారంభమై జాతర 22 గ్రామాల గుండా కొనసాగి సోమవారం మాచునూర్​ శివారులోని పచ్చసాలె ఆవరణలో ముగిసింది.

ఈ సందర్భంగా ముగింపు వేడుకలకు వివిధ ప్రాంతాలకు చెందిన మహిళా రైతులు, ఎన్​జీవోల డైరెక్టర్లు, మేధావులు పాల్గొన్నారు. అనంతరం  డీడీఎస్​ డైరెక్టర్​రుక్మిణీరావు మాట్లాడుతూ..  24 ఏళ్లకు ముందు పీవీ సతీశ్​డీడీఎస్ ను​స్థాపించి ఇక్కడి మహిళా రైతులను చైతన్య పరిచి చిరుధాన్యాల పంటలపై అవగాహన కల్పించారన్నారు. అప్పటి నుంచి పాతపంటల జాతర కొనసాగిస్తున్నామని తెలిపారు. పత్తి పంట వేసి అప్పులపాలవడం కన్నా పాతపంటలు చాలా మేలన్నారు.

చిరుధాన్యాలు పండించడం వల్ల భూసారం పెరగడంతో పాటు మన ఇంటికి తిండి, పశువులకు మేత లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా పాత పంటలు పండించడంలో కృషి చేసిన మహిళా రైతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వికాస ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​కిరణ్, సెంటర్​ ఫర్​సస్టేనబుల్​అగ్రికల్చర్​ డైరెక్టర్ రామాంజనేయులు, సంగారెడ్డి నాబార్డ్​ డీడీఎం కృష్ణతేజ, మెదక్​నాబార్డ్​డీడీఎం తిమోతి, ప్రొఫెసర్​వినోద్,  మహిళా రైతులు పాల్గొన్నారు.