
పద్మారావునగర్, వెలుగు: సీతాఫల్‌మండీ ఆర్యసమాజ్ ప్రాంగణంలోని వేదిక్ విద్యాలయంలో 1992లో టెన్త్ పూర్తిచేసిన 80 మంది స్టూడెంట్లు శనివారం కలుసుకున్నారు. దేశ, విదేశాల్లో స్థిరపడిన వారంతా 32 ఏండ్ల తర్వాత నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో అంతా ఒక్కచోట చేరి స్కూల్ డేస్‌ను గుర్తుచేసుకున్నారు. స్కూల్అభివృద్ధి కోసం రూ.6 లక్షల విరాళం, జిరాక్స్మెషీన్అందజేశారు.
కరోనా టైంలో తల్లిదండ్రులను కోల్పోయిన 18 చిన్నారులను దత్తత తీసుకున్నారు. పూర్వ విద్యార్థులు హరిప్రసాద్, సజేశ్, మధు, ప్రకాశ్, శివకుమార్, జ్యోతి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.