
ఈ ముసలమ్మ పేరు కాశమ్మ. వనపర్తికి చెందిన ఈమె భర్త చాలా ఏండ్ల కిందట చనిపోయాడు. ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. కానీ కొడుకులు ఎక్కడ ఉంటున్నారో తెలియదు. హైదరాబాద్ బంజారాహిల్స్ సింగారికుంటలో ఆమె బిడ్డ రెంటుకు ఉంటుండగా, అక్కడికి వచ్చింది. రెండు నెలల కిందట కాశమ్మ కాలు తొంటి బొక్క విరిగింది. ఆపరేషన్ చేయించుకోవాలంటే డబ్బులు లేవు. సర్కార్ దవాఖాన కు తీసుకుపోయేటోళ్లు లేరు. ఇలా ఎవరూ పట్టించుకునేవారు లేకపోవడంతో బంజారాహిల్స్లోని బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ముందు ఫుట్ పాత్ పైన ఉంటోంది. ఎవరైనా ఫుడ్పెడితే తింటున్నానని, లేదంటే పస్తులు ఉంటూ కాలం వెళ్లదీస్తున్నానని కాశమ్మ చెప్పింది.