ఫ్లైట్‌లో ప్రయాణించాలంటేనే టెన్షన్‌తో భయపడతారు చాలామంది. కానీ, 84 యేండ్ల ఈ బామ్మ చల్మోహనరంగా అంటూ ఏకంగా ఫ్లైట్ నడుపుతోంది.
‘‘ఎనభై నాలుగేళ్ల వయసులో ఫ్లైట్ నడిపిందా? నమ్మలేం. ఫొటో కోసం పోజ్ ఇచ్చి ఉంటుందిలే” అనుకుంటున్నారా? కానే కాదు. ఈ బామ్మ నిజంగానే ఫ్లైట్ నడిపింది. ఎలా? ఎందుకు? అంటే.. మిర్తా గేజ్ అనే ఈ బామ్మ గతంలో పైలెట్‌గా పనిచేసింది. వయసు పైబడడంతో తన పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతోంది. అందుకే ఆమెకి ఇప్పుడు ఏం చేయాలనిపిస్తోందో అది చెయ్యనిస్తే హ్యాపీగా ఉంటుందని, ఫ్యామిలీ మొత్తం కలిసి ఆమె కోరికల లిస్ట్ తయారుచేశారట. ఇదంతా ఒక ఇంటర్వ్యూలో ఆమె కొడుకు ఎర్ల్. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఎర్ల్, కాడి మటియెలో అనే పైలెట్‌ని కలిసి, ఈ విషయం చెప్పాడు. ఆయన అందుకు ఒప్పుకున్నాడు. ఇద్దరినీ తీసుకుని, విన్నిపెసాకీ లేక్, కేర్సర్జ్ పర్వతం మీదుగా వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. దాంతో బామ్మ మళ్లీ పైలెట్ అవతారమెత్తింది. మటియెలో ఫ్లైట్‌ని టేకాఫ్ చేసి, అది గాల్లో ఉండగా... ఫ్లైట్‌ని కంట్రోల్ చేయమని బామ్మకి చెప్పి, తను పక్కకి వచ్చాడు. చేతిలో ఉన్న ఫ్లైట్‌ని ఎప్పటిలాగానే గాల్లో చెక్కర్లు కొట్టించింది బామ్మ. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆమె, ఈ వయసులో ఫ్లైట్ నడపడం అమేజింగ్. పైలెట్ బామ్మ విమానం నడుపుతున్న వీడియోని మటియెలో ఫేస్బుక్లో షేర్ చేశాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు ‘‘ఒన్స్ ఏ పైలెట్, ఫర్ఎవర్మోర్ ఏ పైలెట్” , “అనారోగ్యం అనేది పక్కన పెడితే, ఆమె కాన్ఫిడెన్స్ సూపర్” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
