కోతులు దాడి.. వృద్ధురాలు మృతి

కోతులు దాడి.. వృద్ధురాలు మృతి

కామారెడ్డి జిల్లా :  అడ‌వుల‌ను వ‌దిలేసి ఊళ్లలో ప‌డి తిరుగుతున్న కోతులు దారుణానికి పాల్పడ్డాయి. ఓ  వృద్ధురాలుపై కోతుల గుంపు దాడి చేయడంతో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఇక వివరాల్లోకి వెళ్తే... రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు చాతురబోయిన నర్సవ్వ (70)  ఇంటి బయట ఉండగా కోతుల గుంపు వచ్చి ఆమెపై  దాడికి దిగాయి. వృద్ధురాలు కాలుపై, చేతులపై, వీపుపై దాడి చేశాయి.  దీంతో భయపడిపోయిన వృద్ధురాలు కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో స్థానికులు వెంటనే ఆమెను  గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వృద్ధురాలుపై కన్నుమూసింది. ఊర్లో కోతుల బెడద ఎక్కువైందని... కోతులను గ్రామంలోకి రాకుండా చేయాలని అధికారులను గ్రామస్థులు  వేడుకుంటున్నారు. ఒకవేళ కోతులను బెదిరిస్తే అవి దాడులకు తెగబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.