OLX: ఓఎల్ఎక్స్లోనూ ఉద్యోగులను తొలగిస్తున్నరు

OLX: ఓఎల్ఎక్స్లోనూ ఉద్యోగులను తొలగిస్తున్నరు

ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్ ప్రక్రియ కొనసాగుతోంది. పెద్ద పెద్ద కంపెనీలనుంచి స్టార్టప్‌ల దాకా అన్ని కంపెనీల తమ ఉద్యోగుల్ని ఇంటికి పంపిస్తున్నాయి. ఆ జాబితాలో తాజాగా ఆన్ లైన్ ట్రేడిండ్ కంపెనీ ఓఎల్ఎక్స్ చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఓఎల్ఎక్స్ లో 10వేలమంది పనిచేస్తున్నారు. వాళ్లలో 15 శాతం అంటే 1500మందిని ఉద్యోగాలనుంచి తొలగిస్తున్నట్లు ఓఎల్ఎక్స్ ప్రకటించింది. 

ఓఎల్ఎక్స్.. ఉద్యోగుల తొలగింపు నిర్ణయంతో కంపెనీ ఆటో బిజినెస్‌పై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంజినీరింగ్‌, ఆపరేషన్స్‌ టీంలో పనిచేసే ఉద్యోగులపైన కూడా తొలగింపుల ప్రభావం ఉంటుందని కంపెనీ తెలిపింది. సెకండ్ హ్యాండ్ వస్తువులను విక్రయించే వేదికగా అగ్నస్థానంలో ఉన్న ఓఎల్ఎక్స్ 2009లో భారత్ లో అడుగుపెట్టింది. తర్వాత 2020 జనవరిలో ఓఎల్ఎక్స్.. ఓఎల్ఎక్స్ ఆటో పేరిట ప్రీ ఓన్డ్ కార్స్ వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టింది. అయితే, సంస్థ మొదలుపెట్టిన ఇన్ని సంవత్సరాలకు లేఆఫ్ లు ప్రకటించడం ఇదే మొదటిసారి.