జ్యువెలరీ షాపులో నకిలీ పోలీస్ జబర్దస్తీ..బండారం బయటపడే సరికి..

జ్యువెలరీ షాపులో నకిలీ పోలీస్ జబర్దస్తీ..బండారం బయటపడే సరికి..

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులం అంటూ సినీ ఫక్కీలో కొందరు దుండగులు ఓ జ్యువెలరీ షాపులో బెదిరింపులకు గురి చేశారు. అహ్మద్ గూడ ప్రధాన రహదారిపై ఉన్న ఓం జ్యువెలర్స్ లోకి ఇద్దరు వ్యక్తులు చొరబడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఓటీ పోలీసులం అని షాపులోకి చొరబడిన వారిని చూసి షాప్ యజమాని ఓం ప్రకాష్ కి అనుమానం వచ్చింది . దీంతో పక్కనే ఉన్న బీఆర్ఎస్ నాయకుడు కొత్త భాస్కర్ గౌడ్ కి సమాచారం అందించాడు. వెంటనే భాస్కర్ గౌడ్ పోలీసులకు సమాచారం అందించారు. 

ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత వారిని కీసర పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే నిందితులు ఇద్దరు గతంలో ఎస్ఓటీ టీంకు ఇన్ఫార్మలుగా పనిచేసేవారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.