Video Viral: ఏం వంటకం రా బాబు:  డ్రై ఫ్రూట్స్​తో ఆమ్లెట్​ అంట

Video Viral: ఏం వంటకం రా బాబు:  డ్రై ఫ్రూట్స్​తో ఆమ్లెట్​ అంట

స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు తమ వ్యాపారాన్ని పెంచుకొనే పనిలో పడ్డారు.. కొత్త కొత్త వంటలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. నిత్యం ఏదొక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం కోపాన్ని తెప్పిస్తాయి .. సోషల్ మీడియాలో ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది..డ్రై ఫ్రూట్స్ తో ఆమ్లెట్ చెయ్యడం ఎలా అనే సందేహం కూడా వస్తుంది.. ఇదేలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ టిఫిన్ సెంటర్ వ్యక్తి ఆమ్లెట్ కోసం అంతా సిద్ధం చేసి బ్రెడ్ ఆమ్లెట్ లాగా పెడతాడు.. రెండు వైపులా బాగా కాలుస్తాడు.. దాన్ని ప్లేట్ లోకి సర్వ్ చేస్తాడు.. డ్రై ఫ్రూట్స్ వేసి పనీర్ తో డెకరేషన్ చేస్తాడు.. దాని రుచి ఎలా ఉందో తెలియదు కానీ ఆహా, ఓహో అని లోట్టలేసుకోని తింటారు.. ఈ వింత వంటకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతోంది. వీడియోను కూడా లైక్ చేసారు.. మొత్తానికి వీడియో ట్రెండ్ అవుతుంది..

ఈ  వైరల్ వీడియోను   ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో  పోస్ట్ చేశారు. .  ఒకటి రెండు కాదు పది గుడ్లతో గుడ్డు ఆమ్లెట్‌ను తయారు చేస్తున్నాడు.   వేడి వేడి పాన్‌లో  తురిమిన అల్లంతో పాటు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి , టమోటా వంటి కూరగాయలు వేశాడు.   ఆమ్లెట్ సగం ఉడికిన తర్వాత, ఆమ్లెట్‌పై నాలుగు బ్రెడ్ ముక్కలనుపెట్టి  కొన్ని నిమిషాల తర్వాత, ఆమ్లెట్ తీసి, వెన్నను వేశారు.  ఆమ్లెట్ సిద్ధమైన తర్వాత, అది ఒక ప్లేట్‌లో బయటకు తీయబడుతుంది, దాని తర్వాత దానిపై కరిగించిన వెన్న ను  పోశాడు. 340 రూపాయల ధర కలిగిన ఈ వంటకం గుర్గావ్‌లోని సెక్టార్ 22లో ఉన్న ఒక స్టాల్‌లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు.

రకరకాల వెరైటీగా ఉండే ఆమ్లెట్ లను మనం చూస్తూనే ఉంటాం.. ఇప్పుడు చూసిన ఆమ్లెట్ మాత్రం నెయ్యితో నిండిపోయింది.. వీటిలో ఎన్ని రుచులు ఉండటం వల్ల ఎక్కువగా వీటిని తినడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.. తక్కువ ధర కావడంతో ఎక్కువ మంది వీటిని తినడానికి ఇష్టపడతారు.. అయితే ఇప్పుడు చూస్తే ఆమ్లెట్ వీడియో తెగ వైరల్ అవుతుంది..ఒక ప్రాంతపు ఆహారాన్ని.. మరొక ప్రాంతం వారు తినడం ప్రారంభించారు. ఆ ప్రయోగాన్ని చూసి నెటిజన్లు బాబోయ్ ఇదేమి ఆహారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..