హైదరాబాద్‌‌లో కొత్త రకం ఒమిక్రాన్ కేసు

హైదరాబాద్‌‌లో  కొత్త రకం ఒమిక్రాన్ కేసు

హైదరాబాద్లో కొత్తరకం ఒమిక్రాన్ కేసు బయటపడింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఎ4 తొలి కేసు హైదరాబాద్ లో నమోదైందని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 10 రోజుల క్రితం దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి ఓ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చాడు. అతనికి కరోనా పాజిటివ్గా తేలడంతో శాంపిల్స్ను ఇన్సాకాగ్కు పంపారు. పరీక్ష అనంతరం సదరు వ్యక్తిలో ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బిఎ 4 రకం వైరస్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అలర్ట్ అయిన హెల్త్ డిపార్టమెంట్.. అతనితో పాటు సమావేశంలో పాల్గొన్న 24 మందికి టెస్ట్ లు నిర్వహించగా.. వారందరికీ నెగటివ్ గా తేలింది. 

ఒమిక్రాన్ వేరియెంట్ సోకిన వ్యక్తిని కొన్ని రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచి మరోసారి టెస్ట్ నిర్వహించనున్నట్లు వైద్య శాఖ ప్రకటించింది. 10 రోజుల క్రితం నమోదైన బిఎ4 రకం ఒమిక్రాన్ కేసు భారత్ లో మొట్ట మొదటిదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు చెప్పారు. ఈ వేరియంట్  ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని.. అయినా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మరోవైపు ఇప్పట్లో కరోనా కేసులు పెరిగే అవకాశాలు లేవని, అన్ని జిల్లాలలో కరోనా కిట్లు అందుబాటులో ఉంచామని శ్రీనివాస రావు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను పట్టించుకోవద్దని చెప్పారు.  బిఎ4 లాంటి వేరియంట్స్ వచ్చినా ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ సిద్దంగా ఉందని ప్రకటించారు. 

మరిన్ని వార్తల కోసం

పేరు కోసమే కేసీఆర్ ఆరాటం

నిఖత్ జరీన్ కు అభినందనల వెల్లువ