మహారాష్ట్రలో 40కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు

మహారాష్ట్రలో 40కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. గంట గంటకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఢిల్లీలో 10 కేసులు, మహారాష్ట్రలో 8 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి వరకూ భారత్‌లో  మొత్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 109కి చేరింది. దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా 40 కేసులున్నాయి. ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ వైరస్‌ను తేలిగ్గా తీసుకోవద్దని, అనవసర ప్రయాణాలు, పార్టీలు, ఫంక్షన్లు వాయిదా వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని WHO చెప్పిందని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్.  సౌతాఫ్రికాలో డెల్టా ప్రభావం తక్కువగా ఉండగా.. ఒమిక్రాన్ వేగంగా విజృంభిస్తోందన్నారు. సౌతాఫ్రికాలో నమోదవుతున్న కరోనా కేసులలో 98శాతం ఒమిక్రాన్ ఉంటోందని చెప్పారు. ఒమిక్రాన్ పై వ్యాక్సిన్లు ఎఫెక్టివ్ గా పనిచేయటంలేదనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు.