బ్రెజిల్ లోనూ  బయటపడ్డ  ఒమిక్రాన్ కేసులు

బ్రెజిల్ లోనూ  బయటపడ్డ  ఒమిక్రాన్ కేసులు

చాలా వరకు యూరప్‌ దేశాలకు పరిమితమైన ఒమిక్రాన్‌ ఇపుడు ఇతర దేశాలకు విస్తరిస్తోంది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బ్రెజిల్‌ తోపాటు జపాన్ లోనూ బయటపడింది. రెండు కేసులను గుర్తించినట్లు బ్రెజిల్‌ అధికారికంగా ప్రకటన చేసింది. అలాగే జపాన్ లో కూడా ఒక కేసు వెలుగులోకి వచ్చింది.  ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఒమిక్రాన్‌ 243 మందికి సోకగా, ఈ లక్షణాలు ఉన్న వ్యక్తుల సంఖ్య 1,224కి చేరింది.

దక్షిణాఫ్రికా తరవాత బ్రిటన్‌లో అత్యధికంగా 22 కేసులను గుర్తించారు. 200 మందికి ఒమిక్రాన్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. తొలుత భయపెట్టినట్లుగా నెదర్లాండ్స్‌లో పూర్తి పరీక్షలు వచ్చాక కేసుల సంఖ్య బాగా తగ్గింది. కేవలం 16 కేసులను అధికారికంగా ప్రకటించారు.