కరోనా కొత్త వేరియంట్‌కు పెట్టాలనుకున్న పేరు ఒమిక్రాన్ కాదు!

కరోనా కొత్త వేరియంట్‌కు పెట్టాలనుకున్న పేరు ఒమిక్రాన్ కాదు!

సౌత్ ఆఫ్రికాలో బయటపడ్డ కొత్త కరోనా వేరియంట్ ‘బీ1.1.529’కు గ్రీకు ఆల్ఫాబెట్స్ ప్రకారం.. న్యూ  (Nu)  అని పేరు పెట్టాల్సి ఉంది. అయితే ఇదంతగా బాగోలేదని డబ్ల్యూహెచ్ వో నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ఆల్ఫాబెట్ జీ (Xi)  అని ఉండగా, ఆ పేరు పెడితే చైనా ప్రెసిడెంట్ జీ జిన్ పింగ్ కు ఇబ్బందిగా మారుతుందని దాన్నీ పక్కన పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి. అందుకే జీ తర్వాత వచ్చే ఆల్ఫాబెట్ ప్రకారం దీనికి ‘ఒమిక్రాన్’ అని పేరు పెట్టారని చెప్పాయి. చైనాలో కరోనా పుట్టినప్పటి నుంచి కొత్తగా వచ్చిన వేరియంట్లకు గ్రీక్ అల్ఫాబెట్ల ప్రకారం డబ్ల్యూహెచ్​వో పేర్లు పెడుతూ వస్తోంది.