భారత్ లోకి ఎంటరైన ఒమిక్రాన్

భారత్ లోకి ఎంటరైన ఒమిక్రాన్

దేశంలో 2 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. బెంగళూరులోనే ఈ రెండు కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. 66, 46  ఏళ్ల వ్యక్తులకు ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. సౌతాఫ్రికాలో వెలుగుచూసి ప్రపంచ దేశాల్ని కలవర పెడుతున్న కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భారత్‌లోకీ ప్రవేశించడంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలను అలర్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ మాస్కు తప్పనిసరి చేసిన ప్రభుత్వం .. నేటి నుంచి మాస్క్ పెట్టుకోకుంటే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రూ. వెయ్యి ఫైన్ విధిస్తారని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు.