వారంలో 200 మందికిపైగా స్టూడెంట్లకు పాజిటివ్

వారంలో 200 మందికిపైగా స్టూడెంట్లకు పాజిటివ్
  • గురుకులాలు, స్కూళ్లలో పెరుగుతున్న కేసులు
  • హాస్టళ్లలోని ఇరుకు గదుల్లో కనిపించని ఫిజికల్ డిస్టెన్స్
  • శానిటైజర్లు, మాస్కులు బంద్.. రెక్వెస్ట్​ చేస్తేనే టెస్టులు
  • పిల్లల్ని చూసేందుకు పేరెంట్స్ రావొద్దంటున్న ఆఫీసర్లు
  • ప్రైవేటు కాలేజీల్లో కేసులను దాస్తున్నారనే ఆరోపణలు

నెట్‌‌వర్క్, వెలుగు: బడుల్లో కరోనా కలవరపెడుతోంది. గురుకులాలు, స్కూళ్లలో కొన్నిరోజులుగా కేసులు పెరుగుతున్నాయి. క్లాసులు, హాస్టళ్లలో ఫిజికల్ డిస్టెన్స్ పాటించే పరిస్థితి లేకపోవడంతో ఎక్కువ మంది వైరస్ బారిన పడుతున్నారు. మొన్నటిదాకా అక్కడక్కడ ఒకట్రెండు పాజిటివ్ కేసులు రాగా.. పదిరోజుల నుంచి రోజుకో చోట పదుల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. గత వారం రోజుల్లో 200 మందికి పైగా స్టూడెంట్లకు పాజిటివ్ వచ్చింది. మరోవైపు కొన్ని స్కూళ్లు, ప్రైవేటు కాలేజీలు కేసులను దాస్తున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మొదలైన ఒమిక్రాన్ వేరియెంట్‌‌ భయం, జనవరి నుంచి థర్డ్​వేవ్‌‌ వస్తుందన్న హెచ్చరికలతో పేరెంట్స్‌‌, టీచర్లు టెన్షన్ పడుతున్నారు. కరోనా రూల్స్ అమలు విషయంలో సర్కారు పర్యవేక్షణ లేకపోవడంతోనే కేసులు పెరుగుతున్నాయని, ఇప్పటికైనా స్కూళ్లలో రూల్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

బయటి నుంచి స్కూళ్లకు..

కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇక కరోనా పోయినట్లేనని చాలా మంది​ భావించారు. మాస్కులు పెట్టుకోకుండా తిరిగారు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో కొందరికి కరోనా సోకినా లక్షణాలు కనిపించడం లేదని, దీంతో వాళ్లు వైరస్ క్యారియర్స్‌‌గా మారుతున్నారని, వాళ్ల ద్వారా పిల్లలకు వ్యాపిస్తోందని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇటీవల పలు గురుకులాల్లో వచ్చిన కేసులపై ఎంక్వైరీ చేసి ఇదే విషయం తేల్చారు.పండుగలు, జాతర్ల కోసం ఇండ్లకు వెళ్లి తిరిగి వస్తున్న స్టూడెంట్స్ వల్ల కూడా పాజిటివ్ కేసులు వచ్చాయని ప్రకటించారు. దీంతో అత్యవసరమైతే తప్ప స్టూడెంట్స్ ను గురుకులాలు, హాస్టళ్ల నుంచి సొంతూళ్లకు పంపించవద్దని, కరోనా సోకిన వాళ్లను కూడా ఇండ్లకు పంపకుండా అక్కడే క్వారంటైన్​చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్ హాస్టళ్లలోని స్టూడెంట్లను చూసేందుకు రావొద్దని పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ చాలా గురుకులాలు, హాస్టళ్లలో గదుల కొరత ఉండడంతో పిల్లలను తిరిగి సొంతూళ్లకు పంపిస్తున్నారు. అంటే ఒక స్టూడెంట్​ద్వారా స్కూళ్లు, హాస్టళ్లలోకి ప్రవేశిస్తున్న కరోనా.. ఎక్కువ మంది స్టూడెంట్ల ద్వారా తిరిగి బయటికి పోతోంది.

కరోనా రూల్స్ పాటిస్తలే

స్టేట్ వైడ్ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో సెప్టెంబర్ 1 నుంచి ఫిజికల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ చివర్లో గురుకులాలు, హాస్టళ్లు ఓపెన్​చేశారు. ఒకటి, రెండు రోజుల పాటు శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచినా తర్వాత సర్కారు నుంచి ఎలాంటి ఫండ్స్ రాకపోవడంతో ఆపేశారు. గురుకులాల్లో కనీస ఫెసిలిటీస్​లేక కరోనా రూల్స్ అమలు కావట్లేదు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లోనూ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు రూల్స్ అమలు చేయడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల గురుకులాలు 850కి పైగా ఉండగా, అందులో 75 శాతం గురుకులాలకు సొంత బిల్డింగ్స్ లేక అద్దె భవనాల్లో నడుపుతున్నారు. దీంతో చాలా చోట్ల సరిపడా గదులు లేక ఒక్కో రూంలో వందల మందిని ఉంచి చదువు చెబుతున్నారు. క్లాస్​రూముల్లోనే ఖానా, సోనా అన్నట్లుగా పరిస్థితి ఉంది. దీంతో ఒకరి నుంచి ఇంకొకరికి వైరస్ స్పీడ్​గా స్ప్రెడ్​అవుతోంది. మరోవైపు నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంపిక చేసిన స్కూళ్లలో స్పెషల్​డ్రైవ్ నిర్వహించిన హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్.. ప్రస్తుతం ప్రిన్సిపాల్స్ రెక్వెస్ట్ చేస్తే తప్ప టెస్టులు చేసేందుకు గురుకులాల్లో అడుగుపెట్టట్లేదు. ఇది కూడా కరోనా కేసులు పెరగడానికి కారణమవుతోంది. అడపాదడపా ఇతర ప్రభుత్వ బడుల్లోనూ కేసులు బయటపడుతున్నాయి. ప్రైవేట్​స్కూళ్లు, కాలేజీల్లో, హాస్టళ్లలో నమోదవుతున్న కేసులను దాస్తున్నారనే అనుమానాలున్నాయి. విషయం బయటికి తెలిస్తే పేరెంట్స్ పిల్లలను పంపరని, దీంతో ఫీజుల వసూళ్లు ఆగిపోతాయని మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు భావించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

చల్మెడ మెడికల్ కాలేజీలో మరో 11 మందికి

కరీంనగర్ జిల్లా చల్మెడ మెడికల్ కాలేజీలో ఆదివారం 39 మంది స్టూడెంట్లకు పాజిటివ్ వచ్చింది. సోమవారం మరో 11 మందికి వైరస్ సోకింది. ఈ కాలేజీలో మొత్తం కేసుల సంఖ్య 50కి చేరింది. దీంతో మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కాలేజీకి వారం రోజులు సెలవులు ప్రకటించింది. ఐదు రోజుల కిందట జరిగిన ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్ పార్టీతో వైరస్ వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది.

కేసులు దాస్తున్నరా?

కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు, గురుకులాల్లో కరోనా కేసులను దాస్తున్నారనే అనుమానాలున్నాయి. ఎక్కువ కేసులు వస్తే తప్ప విషయం బయటకు రావడం లేదు. టెక్ మహింద్ర వర్సిటీ విషయంలోనే ఇది వెల్లడైంది. వర్సిటీలో నవంబర్ 17న ఐదుగురికి, 23న ఏడుగురికి, 24న 13 మందికి, 25న ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. అయితే ఈ టెస్టులను ఓ ప్రైవేటు ల్యాబ్ ద్వారా చేయించడంతో అధికారుల దృష్టికి చేరలేదు. మిగిలిన పలు ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ రెండు, మూడు కేసులు నమోదైనా బయటకు రాకుండా, స్టూడెంట్లను ఇంటికి పంపించేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అన్ని గురుకులాలు, స్కూళ్లలో కరోనా రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా క్లాసులు, హాస్టల్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ కోరుతున్నారు.

నెల నుంచి కేసులు పెరుగుతున్నయ్

  •     హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని పీవీ రంగారావు బాలికల గురుకులంలో నవంబర్ 16, 17 తేదీల్లో టెస్టులు చేయగా.. 13 మందికి పాజిటివ్​ వచ్చింది. వీరితోపాటు లక్షణాలు ఉన్న మరో 20 మంది స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇండ్లకు పంపించారు.
  •     సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ముత్తంగిలోని జ్యోతి బాపూలే రెసిడెన్షియల్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 47 మంది స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు, ఒక టీచర్‌‌‌‌‌‌‌‌కు, ఇంద్రేశంలోని బీసీ గురుకుల పాఠశాలలో 25 మంది స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు కరోనా వచ్చింది. ముత్తంగి స్టూడెంట్స్​ను ఇండ్లకు పంపించగా, ఇంద్రేశంలో పిల్లలను ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌లో ఉంచి ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఇస్తున్నారు.
  •     జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గురుకులంలో ఏడుగురు స్టూడెంట్స్ కరోనా బారినపడ్డారు.
  •     సికింద్రాబాద్ కంటోన్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మడ్ ఫోర్డ్ ప్రభుత్వ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే ప్రిన్సిపాల్, ఓ టీచర్ కరోనా బారిన పడగా.. సోమవారం మరో టీచర్ కు వైరస్ సోకింది. దీంతో సెలవు ప్రకటించిన అధికారులు స్కూల్ మొత్తాన్ని శానిటైజ్​ చేయించారు.
  •     జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం కేజీబీవీ హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చదువుకుంటున్న ఇద్దరు స్టూడెంట్లకు ఇటీవల వైరస్ సోకింది.
  •     మెదక్ జిల్లా హవేలీ ఘన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్​లో మూడు రోజుల క్రితం ముగ్గురు స్టూడెంట్స్ కు పాజిటివ్ వచ్చింది.
  •     సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మోడల్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడు రోజుల క్రితం ఒక విద్యార్థికి కరోనా పాజిటివ్​ వచ్చింది. స్టూడెంట్ ఫ్యామిలీ ఇటీవల జాతరకు వెళ్లి రావడంతో వైరస్ సోకినట్లు తేలింది.
  •     నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బీసీ వెల్ఫేర్​హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలుగు రోజుల క్రితం 4వ తరగతి స్టూడెంట్​కు పాజిటివ్​ వచ్చింది.
  •     భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని స్కూల్స్, కాలేజీల్లో ఇప్పటిదాకా 10కి పైగా కేసులు నమోదయ్యాయి.
  •     రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మామిడిపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం 28 మంది స్టూడెంట్లకు టెస్టులు చేయగా.. 6, 7, 8వ తరగతి చదువుతున్న ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలకు పాజిటివ్ వచ్చింది.