కరోనా టెన్షన్‌.. దేశవ్యాప్తంగా ఆంక్షలు కఠినతరం

కరోనా టెన్షన్‌.. దేశవ్యాప్తంగా ఆంక్షలు కఠినతరం

దేశం మరోసారి ఆంక్షల వలయంలోకి వెళ్తుంది. ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో లక్షా 41 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలను అలర్ట్ చేస్తూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, మరికొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ కర్ఫ్యూ కూడా అమలవుతోంది. ఢిల్లీ, కర్నాటకలో వీకెండ్ కర్ఫ్యూ కొనసాగుతోంది. అయితే వీకెండ్స్  కర్ఫ్యూ అమలులో ఉండే రోజుల్లో లిక్కర్   సేల్స్ ను నిలిపేయాలని నిర్ణయించింది కర్ణాటక ఎక్సైజ్ శాఖ. ఇక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్  కర్ఫ్యూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు.

మరోవైపు మహరాష్ట్రలో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటంతో లాక్ డౌన్  దిశగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా నైట్ కర్ఫ్యూని అమలు చేస్తోంది. అస్సాంలో కోవిడ్ ఆంక్షలు కఠినం చేశారు. రెండు డోసుల వ్యాక్సినేష న్ పూర్తయిన వారికి మాత్రమే.. హోట ళ్లు, రెస్టారెంట్లు, గ వ ర్నమెంట్ ఆఫీసులు, షాపింగ్ మాల్స్ , మ ల్టీప్లెక్సుల్లోకి అనుమ తిస్తున్నారు. పంజాబ్ లో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ఉంటున్నాయి. బార్లు, పబ్ లు, మాల్స్, రెస్టారెంట్లు, సినిమా థియేటర్ లలో 50 శాతం సీట్లకే అనుమతిచ్చారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లో రెండు డోస్ లు వేసుకున్న సిబ్బందికే మాత్రమే అనుమతిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు బంద్ పెట్టారు. వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేశాయి రాష్ట్రాలు.