ఒమిక్రాన్ ఇండియాకు ఓ వేకప్ కాల్

ఒమిక్రాన్ ఇండియాకు ఓ వేకప్ కాల్

న్యూఢిల్లీ: కరోనా కథ ముగిసిందని అనుకుంటున్న తరుణంలో మరో కొత్త కొవిడ్ వేరియంట్ అందర్నీ భయపెడుతోంది. ఒమిక్రాన్ పేరుతో పిలుస్తున్న ఈ వేరియంట్ దక్షిణాఫ్రికాలో వెలుగు జూసింది. ఈ వేరియంట్ క్రమంగా చాలా దేశాలకు వ్యాపిస్తోంది. ఈ వేరియంట్ మన దేశంలోకి విస్తరించి, మరో వేవ్​కు దారి తీయవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సైంటిస్టు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ స్పందించారు. భారత్ కు ఇదో వేకప్ కాల్ లాంటిదన్న ఆమె.. కరోనా నియమాలను పాటించకుంటే ముప్పు తప్పదని హెచ్చరించారు. 

డెల్టా వేరియంట్ కంటే వేగంగా ఒమిక్రాన్ వ్యాపిస్తోందన్నారు. ఈ వేరియంట్ గురించి ఇప్పుడే పూర్తిగా చెప్పలేమని.. దీనిపై మరింత పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు. ప్రజలు మాస్కులు కట్టుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజర్లు వాడుతూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాస్కు కట్టుకుంటే టీకా జేబులో ఉన్నట్లేనన్నారు. కరోనాతో ఫైట్ లో మాస్కులు చాలా ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు. ఇంకా టీకా తీసుకోని వారు వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు.