తెలంగాణలో ఒమిక్రాన్ టెన్షన్.. జీనోమ్ సీక్వెన్సింగ్ కు 13 శాంపిల్స్ 

తెలంగాణలో ఒమిక్రాన్ టెన్షన్.. జీనోమ్ సీక్వెన్సింగ్ కు 13 శాంపిల్స్ 

భారత్ లో ఒమిక్రాన్ టెన్షన్ పుట్టిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఐదు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర,కర్నాటక,గుజరాత్, ఢిల్లీలో పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ కొత్త వైరస్ భయం తెలంగాణ ప్రజల్ని వెంటాడుతోంది. తాజాగా వైద్య శాఖ కొత్త వేరియంట్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు వచ్చాయన్న వైద్య శాఖ.. తెలంగాణలో ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణలో విదేశాల నుంచి వచ్చిన 13 మందికి పాజిటివ్ రావడంతో వారి జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపామన్నారు. సాయంత్రం వరకు వాటి ఫలితాలు వస్తాయన్నారు. 

మరోవైపు తాజాగా ఢిల్లీలో మరో కేసు వెలుగుచూసింది. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్‌ వైరస్‌ను గుర్తించారు. పాజిటివ్‌ వచ్చిన మొత్తం 17 మంది ప్రయాణికుల్లో 12 మంది నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించామని, అందులో ఒకరికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ అని ప్రాథమికంగా నిర్ధారణ అయిందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ చెప్పారు. ప్రస్తుతం వారంతా ఎల్‌ఎన్‌జేపీ దవాఖానలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.