బీసీ రిజర్వేషన్ల పై..ఇవాళ(అక్టోబర్16)సుప్రీంలో విచారణ

బీసీ రిజర్వేషన్ల పై..ఇవాళ(అక్టోబర్16)సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ, వెలుగు:బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ గురువారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9ని తీసుకురాగా, దానిపై హైకోర్టు స్టే విధించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 13న అర్ధరాత్రి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. 

ఈ పిటిషన్‌‌‌‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టనుంది. కాగా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తగ్గట్టుగా శాస్త్రీయంగా జరిగిందని పిటిషన్‌‌‌‌లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కులగణన సర్వేలో బీసీల జనాభా 57.6 శాతం ఉన్నట్టు తేలిందని, దాని ఆధారంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని కమిషన్ సిఫార్సులు చేసిందని తెలిపింది.