
ఉపాధ్యాయుడు అంటే క్రమశిక్షణకు మారుపేరులా ఉండాలి.. విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పి సక్రమం మార్గంలో నడిచేలా చేయాలి..కానీ ఈ హెడ్ మాస్టర్ ఏంటీ..ఇలా వాయిలెంట్ గా బిహేవ్ చేశాడు..నీ పద్దతేం బాలేదు.. తీరు మార్చుకోవాలని అని మందలించిన ఎడ్యుకేషన్ ఆఫీసర్ నే చితకబాదాడు.. మామూలు కాదు.. బెల్ట్ తీసి దారుణంగా కొట్టాడు. యూపీలోని విద్యాశాఖ అధికారిపై స్కూల్ హెడ్ మాస్టర్ బెల్ట్ తో దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అది యూపీలోని సీతాపూర్ బేసిక్ శిక్షా అధికారి ఆఫీసు.. లేడీ టీచర్ ను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహ్మదాబాద్ బ్లాక్ లోని ఓ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు బ్రిజేష్ కుమార్ విచారణకు హాజరయ్యారు. బ్రిజేష్ కుమార్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని విద్యాశాఖ అధికారి అఖిలేష్ ప్రతాప్ సింగ్ అతనిని మందలించాడు. దీంతో హెడ్ మాస్టర్ బ్రిజేష్ కుమార్ కోపంతో ఊగిపోతూ విద్యాశాఖ అధికారిపై దాడి చేశాడు.
►ALSO READ | కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 5 వేల పీజీ, 5023 MBBS సీట్ల పెంపు
హెడ్ మాస్టర్ బ్రిజేష్ కుమార్ పై వచ్చిన ఫిర్యాదులకు సమాధానం చెప్పకపోవడంతో విద్యాశాఖ అధికారి అఖిలేష్ తిట్టాడు. కోపంతో రెచ్చిపోయిన బ్రిజేష్.. ఎడ్యుకేషన్ ఆఫీసర్ పై దాడి చేశాడు. బెల్ట్ తీసి పలుమార్లు కొట్టాడు. అక్కడున్న సిబ్బంది అడ్డుకొని అతడిని బయటికి ఈడ్చుకెళ్లారు. విద్యాశాఖ అధికారిపై దాడి, చంపేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకొని బ్రిజేష్ కుమార్ ను అరెస్ట్ చేశారు.
విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పి సక్రమ మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే ఇలా వాయిలెంట్ గా ప్రవర్తిస్తే ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటని..