
హైదరాబాద్ 300 ఏళ్ల క్రితమే అద్భుతంగా డిజైన్ చేయబడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో హైదరాబాద్ అభివృద్ధిపై చర్చ నిర్వహించారు. అవాస్తవాలు ప్రచారం చేసి బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని బలహీనం చేయాలని చూస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. హైదరాబాద్ సిటీ విస్తరిస్తోందని కాబట్టే హైడ్రాను తీసుకొచ్చామని అన్నారు ఆయన.
2వేల చ.కీ.మీ వరకు హైడ్రాను విస్తరిస్తామని తెలిపారు. హైడ్రాను 12 జోన్లుగా విభజించి.. జోన్ కు ఓ ఆఫీసర్ ను పెడతామన్నారు. గతంలో కండ్లముందే చెరువులు, నాలాలు కబ్జాకు గురైయ్యాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని అసెంబ్లీలో గుర్తుచేశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా ఉంటామని సీఎం తెలియజేశారు. నాలాలు, చెరువులు కబ్జా చేయాలంటే వణుకు పుట్టేలా చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా తెలిపారు.
హైదరాబాద్ విస్తరిస్తుందనే ప్రపంచ దేశాల్లో స్టడీ చేసి హైడ్రాను రూపొందించామని ముఖ్యమంత్రి అన్నారు. నిజాం, ఉస్మాన్ సాగర్ వల్లే ఈరోజు హైదరాబాద్ కు తాగునీరు అందుతున్నందని తెలిపారు. మూసీని లండన్ థేమ్స్ నదిగా సుందరీకరణ చేస్తామని తెలిపారు. మూసీ రివర్ ప్రాజెక్ట్ కోసం గోబల్ టెండర్ల పిలుస్తామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్మించారని.. గత ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డును రూ.7వేల కోట్లకు తాకట్టు పెట్టిందని విమర్శించారు.