కన్నప్ప ఫస్ట్‌‌ లుక్ పోస్టర్‌‌‌‌ విడుదల

కన్నప్ప ఫస్ట్‌‌ లుక్ పోస్టర్‌‌‌‌ విడుదల

మంచు విష్ణు లీడ్‌‌ రోల్‌‌లో నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. గురువారం విష్ణు బర్త్‌‌ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌‌ లుక్ పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు. భారీ శివలింగం ఆకారంలో ఉన్న ప్రకృతి మధ్య, విల్లుని ఎక్కుపెట్టిన కన్నప్ప లుక్ ఆకట్టుకుంది. 

ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం న్యూజిలాండ్‌‌లో షూటింగ్ జరుగుతోంది. అక్కడే ఎనభై శాతం షూటింగ్ జరగనుంది. ‘శివుడి ప్రియ భక్తుడైన కన్నప్పను తెరపైకి తీసుకొచ్చేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఓ దృశ్యకావ్యంలా, మునుపెన్నడూ చూడని ఓ సినిమాటిక్ ఎక్స్‌‌పీరియెన్స్ ఇచ్చేలా తెరకెక్కిస్తున్నాం’ అని మంచు విష్ణు తెలిపాడు.