హైదరాబాద్ లో అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు.. పలు వాహనాలు సీజ్

హైదరాబాద్ లో అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు.. పలు వాహనాలు సీజ్

హైదరాబాద్​ : నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ లో  అర్ధరాత్రి సమయంలో పలుచోట్ల పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. వాహనాలపై తిరుగుతున్న వారిని తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి సరైన పత్రాలు లేకుండా.. అర్ధరాత్రి సమయంలో అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. మరోవైపు ట్రాఫిక్​ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మద్యం మత్తులో వాహనాలను నడుపుతున్న వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.