ఇండియా బార్డర్​లో.. మరో సొరంగం

ఇండియా బార్డర్​లో.. మరో సొరంగం

150 మీటర్ల టన్నెల్​ను గుర్తించిన బీఎస్ఎఫ్

ఆరు నెలల్లో మూడు టన్నెల్స్ గుర్తింపు

జమ్మూ: పాకిస్థాన్ బార్డర్ లో మరో సొరంగం బయటపడింది. జమ్మూలోని కథువా జిల్లా, హీరానగర్ సెక్టార్, బాబియాన్ గ్రామం వద్ద ఇంటర్నేషనల్ బార్డర్ కిందుగా150 మీటర్ల పొడవున తవ్విన సొరంగాన్ని బుధవారం బీఎస్ఎఫ్​జవాన్లు గుర్తించారు. పాక్ నుంచి టెర్రరిస్టులను మనదేశంలోకి దాటించేందుకు బార్డర్ కిందుగా తరచూ టన్నెల్స్ తవ్వుతున్న నేపథ్యంలో బీఎస్ఎఫ్ యాంటీ టన్నెలింగ్ ఆపరేషన్ చేపట్టింది. దీంతో ఈ సొరంగం సంగతి తెలిసినట్లు బీఎస్ఎఫ్ ఐజీ ఎన్.ఎస్. జమ్వాల్  వెల్లడించారు. సొరంగం 25 నుంచి 30 మీటర్ల లోతున, 2 నుంచి 3 ఫీట్ల వెడల్పుతో తవ్వారని తెలిపారు. జమ్మూలోని సాంబా, కథువా జంట జిల్లాల్లో గత ఆరునెలల్లో బీఎస్ఎఫ్ గుర్తించిన మూడో సొరంగం ఇది. ఈ సొరంగం ఆవలివైపు పాక్ లోని శకర్ గఢ్ ప్రాంతం వైపుగా ఉందని, ఆ ప్రాంతం టెర్రరిస్టులకు లాంచ్ ప్యాడ్ గా మారిందని అధికారులు తెలిపారు. పాక్ ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టన్నెల్ వద్ద పాకిస్థాన్ కు చెందిన శాండ్ బ్యాగ్ లు దొరికాయని, వాటిపై పాకిస్థానీ మార్కింగ్స్ కూడా ఉన్నాయని పేర్కొన్నారు. శాండ్ బ్యాగ్ లు నాలుగేళ్ల క్రితం తయారైనట్లుగా ఉన్నాయని, అయితే ఈ సొరంగాన్ని ఎప్పుడు తవ్వారన్నది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుందన్నారు. ఈ సొరంగం ద్వారా ఇటీవల చొరబాట్లేమీ జరగలేదన్నారు.

ఇవీ చదవండి..

జేఈఈ స్టూడెంట్ల కోసం అమెజాన్ అకాడమీ

పతంగులు ఎందుకు ఎగరేస్తరో తెలుసా?

జాక్‌మా కంపెనీలను జాతీయం చేసే యోచనలో చైనా

సంక్రాంతి వేడుకంతా రైతుదే