
హైదరాబాద్ : ఎల్బీనగర్ నియోజకవర్గంలో మరోసారి ప్రోటోకాల్ వివాదం బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మధ్య చిచ్చు రాజేసింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీజేపీ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అభివృద్ధి ప్రారంభోత్సవాల్లో తమ పార్టీ కార్పొరేటర్లను ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్ వర్గీయులు ఒకరిపై మరొకరు తిట్టుకున్నారు.
ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి ఇంటిపై బీఆర్ ఎస్ కార్యకర్తలు దాడి చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మహిళలే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఓడిస్తారని శపథం చేశారు బీజేపీ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి.