
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. పినపాక మండలం వెంకట్రావుపేటలో పిచ్చికుక్క దాడిలో ఏడాది వయస్సున్న చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్సకోసం చిన్నారినివెంటనే ఆస్పత్రికి తరలించారు.
మంగళవారం (ఆగస్టు 26) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పినపాక మండలం వెంకట్రావుపేటకు చెందిన ఏడాది వయస్సున్న సౌందపు ఈశన్విక్ పై పిచ్చికుక్క దాడి చేసింది. బాలుడిని ఇంటి వరండాలో ఉంచి తల్లి పనిచేసుకుంటుండగా పిచ్చికుక్క దాడి చేసింది. కుక్కదాడిలో బాలుడి మొఖంపై తీవ్రగాయాలయ్యాయని పేరెంట్స్ సంతోష్, వెన్నెల తెలిపారు. బాబును వెంటనే చికిత్సకోసం మణుగూరు తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించి వైద్య సేవలందిస్తున్నారు.
Also read:-మెహదీపట్నం బస్టాండులో..ఆర్టీసి బస్సులో మంటలు..భయంతో పరుగులు పెట్టిన ప్రయాణికులు
వెంకట్రావుపేటలో పిచ్చికుక్క విహారంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వీధికుక్కల నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.