
సింగరేణి బొగ్గు గనుల్లో ఒక రోజు సమ్మె జరుగుతోంది. 28 భూగర్భ, 18 ఓపెన్ కాస్ట్ గనుల్లో కార్మికులు సమ్మె చేస్తున్నారు. బొగ్గు సంస్థల్లో 100శాతం FDIలను అనుమతించడానికి నిరసనగా… కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లో కార్మికులు ఉదయం నుంచే విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఫస్ట్ షిఫ్ట్ లో ఎమర్జెన్సీ కార్మికులు తప్ప …ఎవరు విధులకు హాజరుకాలేదు. రామగుండం రీజియన్ లో మొత్తం 15 వేలమంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మెతో గనులు బోసిపోయాయి. 100శాతం FDIలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కార్మిక నేతలు.