
ధనాధన్ షాట్లతో.. బౌండరీల జోరుతో.. సిక్సర్ల హోరుతో.. మెరుపు విన్యాసాలతో.. మది పులకించే సన్నివేశాలతో.. నిండు వేసవిని.. చల్లని సాయంత్రాలతో గడిపేసిన క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు మరో మెగా సంబురం సిద్ధమవుతున్నది. 4 ఏళ్లకు ఒక్కసారి వచ్చే పండుగ.. 46 రోజుల పాటు ప్రపంచాన్ని ఏకం చేసే ఆట.. 10 జట్ల పోరాటం.. గిరిగిసి బరిలోకి దిగితే చిరుతల్లా వేటాడే.. కొదమసింహాల్లా కొట్లాడే ఆటగాళ్లు.. ఊపిరి ఆగిపోయే సన్నివేశాలు.. ఉత్కంఠను రేపే అభినివేశాలు.. గెలిస్తే పూలవర్షం.. ఓడితే రాళ్ల వర్షం.. సింగి ల్ నైట్‌తో మారిపోయే జీవితాలు..సింగి ల్ మ్యాచ్ తో తారుమారయ్యే ఫలితాలు.. దేశాధ్యక్షుడి నుంచి.. రిక్షా కార్మికుడి వరకు.. ఎక్కడా ఉన్నా… ఎడతెరిపి లేకుండా.. ఆద్యంతం ఆసక్తిగా తిలకించే.. ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ కు సమయం ఆసన్నమైంది. 44 ఏండ్ల చరిత్ర.. 11 టోర్నీల పరంపర.. బ్యాట్ పట్టిన ప్రతి కుర్రాడు.. బంతి గురిపెట్టిన ప్రతి మొనగాడు.. ఒక్కసారైనా ఆడాలని కలలుగనే ఓ అద్భుత సౌధం… ఒక్కసారైనా ముద్దా డాలనే ఓ మహాద్భుత ఔషధం.. చరిత్రకు ఏమాత్రం కొత్తకాదు.. యుద్ధానికి ఏమాత్రం తక్కువ కాదు.. వ్యూహాలు.. ప్రతి వ్యూహాలు.. ఇలా చెప్పుకుంటూపోతే ఓ చరిత్ర.. వినుకుంటూ పోతే ఓ కొత్త వింత.. ఆరంభంలో ఆధిపత్యం ఒక్కరిదే అయినా.. కాలం ఇచ్చిన గొప్ప అవకాశాలను సద్వినియోగం చేసుకున్న జట్లనీ ఎప్పుడో ఓసారి విజేతలుగా నిలిచాయి. ప్రయత్నించి పరాజయం పాలైన ఇతర జట్లకు మరో అవకాశంగా.. ఇంగ్లం డ్ గడ్డపై పుట్టి.. ప్రపంచం మొత్తం తిరుగుతూ.. మళ్లీ పురుటి నాడిపైకి వచ్చేసి12వ పుట్టిన రోజు కోసం సిద్ధమైంది.
తొలి ముద్దు విండీస్ దే
క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ లో ప్రుడెన్షియల్ కప్ పేరుతో1975లో వన్డే మహా సంగ్రామం మొదలైంది. ఎర్రబంతితో, తెల్ల డ్రెస్సుల్లో .. 60 ఓవర్ల ఫార్మాట్ లోజరిగిన తొట్ట తొలి కప్ లో ఎనిమిది దేశాలు బరిలోనిలిచాయి. ఇంగ్లం డ్ , ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ , వెస్టిం డీస్, న్యూజిలాండ్ తో పాటు, శ్రీలంక, ఈస్ట్ ఆఫ్రికా ఆహ్వాన టీమ్స్‌గా పోటీ పడ్డాయి . క్లైవ్ లాయి డ్‌కెప్టెన్సీలోని వెస్టిం డీస్ ఫైనల్లో 17 పరుగుల తేడాతోఆస్ట్రేలియాను ఓడిం చి తొలి కప్పును ముద్దాడింది.
మళ్లీ కరీబియన్లే
1979లో మరోసారి ప్రుడెన్షియల్ కప్ పేరుతో ఇంగ్లండ్ ఆతిథ్యం ఇచ్చిన రెండో వరల్డ్ కప్ లో కరీబియన్లే విజయం సాధిం చారు. ఫైనల్లో తిరుగులేనివిధంగా ఆడిన క్లైవ్ లాయి డ్ సే న 92 పరుగులతేడాతో ఇంగ్లం డ్ ను ఓడించిం ది. తొలి ఎడిషన్ ఫా-ర్మాట్ లోనే సాగిన టోర్నీలో ఈస్ట్ ఆఫ్రికా ప్లేస్‌లోకెనడా వరల్డ్ కప్ అరంగేట్రం చేసిం ది.
కపిల్ సేన సంచలనం
ముచ్చటగా మూడోసారి ఇంగ్లం డ్ లోనేజరిగిన 1983 వరల్డ్ కప్ ఇండియాకే కాదుక్రికెట్ ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలిచిపో-యింది. ఈ సారి ఫార్మాట్ మారిం ది. మ్యాచ్ లసంఖ్య పెరిగిం ది. రెండు గ్రూపుల్లోని నాలుగేసిజట్లు మిగతా మూడు జట్లతో రెండేసి మ్యా-చ్ ల్లో తలపడ్డాయి . కెనడా ప్లేస్‌లో జిం బాబ్వేపోటీ పడిం ది. అంచనాలే లేకుండా బరిలోకిదిగిన కపిల్‌దేవ్ నేతృత్వం లోని ఇండియాసంచలనం సృష్టించిం ది. వెస్టిం డీస్ ఆధిప-త్యానికి గండి కొడుతూ కపిల్ నేతృత్వం లోనిఇండియా మొదటిసారి వరల్డ్ కప్ ను ము-ద్దా డిం ది. ఫైనల్లో 183 పరుగులకే ఆలౌటైనఇండియా.. అద్భుత బౌలిం గ్ తో కరీబియన్‌టీమ్‌ను 140కే కుప్పకూల్చిం ది. ఈ కప్పుతోఇండియాలో క్రికెట్ స్వరూపమే మారిం ది.
ఆస్ట్రేలియా ఆధిపత్యం షురూ
ఇండియా, పాకిస్థాన్ 1987లో సంయుక్తంగాఆతిథ్యం ఇచ్చిన నాలుగో ఎడిషన్ లో కప్పు పేరు,ఫార్మాట్ మారిం ది. 60 ఓవర్ల నుం చి ఇప్పుడుఆడుతున్న 50 ఓవర్ల ఫార్మాట్ లో జరిగిం ది. ఎన్నోఅంచనాలతో బరిలోకి దిగిన ఆతిథ్య ఇండియా, పాకి-స్థాన్ ఫైనల్‌కు చేరుకోలేక నిరాశ పరిచాయి. ఈడెన్‌గార్డెన్స్‌లో వేలాది ప్రేక్షకులు హాజరైన తుదిపోరులో 7పరుగుల తేడాతో ఇంగ్లం డ్ ను ఓడిం చిన ఆస్ట్రేలియాకొత్త చాం పియన్ గా అవతరించిం ది. అప్పటినుం చేక్రికెట్ లో ఆసీస్ ఆధిపత్యం మొదలైంది.
రంగుల్లో పాకిస్థాన్ మెరుపులు
యూరోప్ , ఆసియా దాటి ఆస్ట్రేలియా ఖండంలో అడుగిడిన 1992 ఐదో అంచె కప్పు ప్రత్యేకతలెన్నో. తెల్ల జెర్సీలు , ఎర్ర బంతికి, పగటి పూట మ్యాచ్ లకు కాలం చెల్లింది. రంగు దుస్తుల్లో , ఫ్లడ్ లై ట్ల వెలుతురు-లో, తెల్ల బంతితో ఇప్పుడు చూస్తు న్న మెరుపులకు నాడు ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ లో బీజం పడిం ది. ఫార్మాట్ కూడా మారిం ది. గ్రూప్ ల్లోకాకుండా కంప్లీట్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన టోర్నీలో 9 జట్లుబరిలో నిలిచాయి. ఫుల్‌టైమ్ మెం బర్ గా సౌతాఫ్రికా అరంగేట్రం చేసినఈ టోర్నీలో పాకిస్థాన్ విజేతగా నిలిచిం ది. మూడోసారి ఫైనల్‌కు వచ్చినఇంగ్లం డ్ ఆశలు ఆవిరయ్యాయి.
లంక విజయఢంకా
1996లో వరల్డ్ కప్ మరోసారి ఇండియాను పలుక-రించిం ది. అసోసియేట్ దేశాలు కెన్యా, నెదర్లాండ్స్,యూఏఈలకు అవకాశం ఇవ్వడంతో జట్ల సంఖ్య 9 నుంచి 12కు పెరిగిన టోర్నీలో శ్రీలంక అనూ-హ్యంగా దూసుకొచ్చిం ది. సెమీస్‌లో ఇండియానుచిత్తు చేసిన అర్జున రణతుం గ కెప్టెన్సీలోని లంకఫైనల్లో ఆసీస్‌ను ఓడిం చి కప్పు నెగ్గింది.
ఆసీస్ మళ్లీ మురిసే
1999 వరల్డ్ కప్ మరోసారి తన పుట్టినిల్లు ఇంగ్లండ్ లో అడుగుపెట్టిం ది. స్పాన్సర్ల పేర్లకు బదులు ‘ఐసీసీక్రికెట్ వరల్డ్ కప్ ’పేరు స్థిరపడిపోయింది ఈ టోర్నీతో-నే. బంగ్లాదేశ్ తొలిసారి బరిలోకి దిగిన ఈ కప్పుతోనేసూపర్ సిక్స్ స్టేజ్ ను షురూ చేయడంతో మ్యాచ్ లసంఖ్య పెరిగిం ది. తుదిపోరులో పాక్‌ను ఓడిం చినఆసీస్ రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుం ది
కంగారూల తీన్ మార్
జిం బాబ్వే, కెన్యాతో కలిసి సౌతాఫ్రికా తొలిసారిఆతిథ్యం ఇచ్చిన 2003 వరల్డ్ కప్ ను ఇండియాఫ్యాన్స్ అంత త్వరగా మరచిపోలేరు. 14 జట్లుబరిలో నిలిచిన ఈ టోర్నీలో సౌరవ్ గంగూలీ కెప్టె-న్సీలోని టీమిం డియా చెలరేగి ఆడిం ది. టోర్నీలోటాప్ స్కోరర్ గా నిలిచిన సచిన్ టెండూల్కర్‌మరోసారి తన విశ్వరూపం చూపాడు. కానీ, ఫైనల్లోఇండియాను చిత్తు చేసిన ఆస్ట్రేలియా అత్యధికంగామూడో టైటిల్‌ను కైవసం చేసుకొని వన్డేల్లో తనకుఎదురులేదని మరోసారి నిరూపించింది..
మళ్లీ ఆసీసే
కరీబియన్ దీవుల్లో జరిగిన 2007 టోర్నీలోఅత్యధికంగా 16 జట్లు పోటీ పడ్డాయి . రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో కరీబియన్ దీవుల్లో అడుగు-పెట్టిన టీమిం డియా అత్యం త దారుణమైనఆటతో బంగ్లాదేశ్ చేతిలో ఓడి గ్రూప్ దశలోనేఇంటిదారి పట్టిం ది. రికీ పాంటిం గ్ సారథ్యం లోబరిలోకి దిగిన డిఫెండిం గ్ చాం పియన్ ఆస్ట్రేలి-యా మరోసారి తిరుగులేని ఆధిపత్యాన్ని చెలా-యించిం ది. ఫైనల్లో శ్రీలంకను ఓడిం చి హ్యాట్రిక్ టైటిల్ నెగ్గింది.
గర్జించిన ధోనీసేన
మూడోసారి ఇండియా ఆతిథ్యం ఇచ్చిన మెగా టోర్నీదేశంలో క్రికెట్ ఫీవర్ ను పతాక స్థాయి కి తీసుకెళ్లిం -ది. మళ్లీ గ్రూప్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగిన ఈటోర్నీలో 14 జట్లు బరిలోకి దిగిన టోర్నీకి ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. అంతకుముం దు అంచెలోదారుణంగా ఆడిన టీమిం డియా.. ఈ సారి మహేంద్రసిం గ్ ధోనీ సారథ్యం లో సమరోత్సాహంతో బరిలోకిదిగిం ది. క్రికెట్ లెజెండ్ సచిన్ ఖాతాలో ఎలాగైనా ప్ర-పంచకప్ చేర్చాలని ఇండియా ఆటగాళ్లం తా కసిగాఆడి.. కప్పును అందుకున్నా రు. యువరాజ్ సిం గ్‌మెరుపులు.. శ్రీలంకతో ఫైనల్లో ధోనీ కొట్టిన సిక్సర్‌అభిమానుల గుం డెల్లో చెరగని ముద్రగా నిలిచిం ది.
కంగారూల పాంచ్ పటాకా
న్యూజిలాండ్ తో కలిసి మరోసారి ఆతిథ్య హక్కులుదక్కిం చుకున్న ఆస్ట్రేలియా ఐదో కప్పుతో ఎదు-రేలేదని నిరూపిం చుకుం ది. డిఫెండిం గ్ చాంప్ఇండియా సెమీస్‌లోనే పోరాటాన్ని ముగిం చగా…దిగ్గజ ప్లేయర్ల నిష్క్రమణ తర్వాత మైకేల్ క్లార్క్ కెప్టెన్సీలోని ఆసీస్ చెలరేగిం ది. ఫైనల్లో దాయాదిన్యూజిలాండ్ పై అనూహ్య విజయం సాధించిం ది.