
గ్రామస్థుల కోసం సర్పంచ్ వినూత్న ప్రయత్నం
ఇంటికో కోడి, 10 గుడ్లు పంపిణీ
కరోనా నియంత్రణకు దేశమంతా లాక్డౌన్ అమలులో ఉంది. మే 3 వరకు ఈ లాక్డౌన్ అమలులో ఉంటుందని ప్రధాని మోడీ ప్రకటించారు. అయితే తెలంగాణలో మాత్రం మే 7 వరకు అమలులో ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే నెలరోజులకు పైగా లాక్డౌన్ పాటిస్తూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు కూడా దొరకక కష్టాలు పడుతున్నారు. అలా తమ గ్రామ ప్రజలెవరూ ఇబ్బంది పడొద్దని సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని గుంతపల్లి సర్పంచ్ సుమిత్ర అనుకున్నారు. అందుకోసం గతంలోనే నెలకు సరిపడా 14 రకాల నిత్యావసర వస్తువులు, కూరగాయలు రెండుసార్లు పంపిణీ చేశారు. ఇప్పడు తాజాగా గ్రామంలోని ప్రతి ఇంటికీ రెండు కిలోల కోడి, 10 గుడ్లు అందజేశారు. వీటితో గ్రామస్థులకు పోషకాహారం అందుతుందని, తద్వారా రోగనిరోధక శక్తి పెరిగి.. కరోనాను ఎదర్కొగలరని ఆమె అన్నారు.
For More News..