వంద రోజుల తర్వాత కోల్‌కతా కాళీ టెంపుల్ ఓపెన్

వంద రోజుల తర్వాత కోల్‌కతా కాళీ టెంపుల్ ఓపెన్

కోల్ కతా: కోల్ కతాలోని ప్రముఖ ఆలయం కాళీ ఘాట్ టెంపుల్ దాదాపు 100 రోజుల తర్వాత ఓపెన్ అయింది. కరోనా కట్టడి చర్యలు తీసుకుంటూ జూలై 1 నుంచి ఆలయాలను ఓపెన్ చేసుకోవచ్చని బెంగాల్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. కాళీఘాట్ గుడి తలుపులు బుధవారం తెరుచుకున్నాయి. టెంపుల్లోకి ఒక్కసారి 10 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నామని, గర్భగుడిలోకి ఎవరినీ వెళ్లనివ్వడం లేదని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఆలయం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు.. సాయంత్రం 4 నుంచి 6:30 వరకు తెరిచి ఉంటుందని చెప్పారు. టెంపుల్ గేట్ దగ్గరే భక్తులపై డిసిన్ఫెక్టెంట్స్ స్ప్రే చేస్తున్నారు.