భార్యను 51 మందితో రేప్ చేయించిన భర్త

భార్యను 51 మందితో రేప్ చేయించిన భర్త
  • 9 ఏండ్లలో 92 సార్లు డ్రగ్స్ ఇచ్చి దారుణం.. ఫ్రాన్స్‌‌లో ఘటన  
  • భర్త సహా 51 మంది అరెస్ట్  

ప్యారిస్: ఫ్రాన్స్‌‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యకు డ్రగ్స్ ఇచ్చి 51 మందితో అత్యాచారం చేయించాడు. తొమ్మిదేండ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఫ్రాన్స్‌‌లో సంచలనంగా మారింది.  ఫ్రాన్స్‌‌లోని మజాన్‌‌కు చెందిన  డొమినిక్ తన భార్యకు  ఫుడ్ లో యాంటీ యాంగ్జయిటీ డ్రగ్ కలిపి తినిపించేవాడు. భార్య మత్తులోకి వెళ్లాక ఇంటికి కొందరిని పిలిచేవాడు. వాళ్లు ఆమెపై అత్యాచారం చేస్తుంటే.. వీడియోలు తీసేవాడు.

వాటిని యూఎస్‌‌బీ డ్రైవ్‌‌లో సేవ్ చేసేవాడు. ఇలా 2011 నుంచి 2020 మధ్య 92 సార్లు ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో 51 మందిని అరెస్ట్ చేశామని..మిగితా వారి కోసం సెర్చ్ చేస్తున్నామని వెల్లడించారు. పెన్ డ్రైవ్‌‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అరెస్టు చేసిన వారిలో  ఫైర్‌‌మెన్, లారీ డ్రైవర్, మున్సిపల్ కౌన్సిలర్, ఐటీ ఉద్యోగి, జైలు గార్డు, నర్సు, జర్నలిస్టు ఉన్నట్లు చెప్పారు. వీరిని ఓ ఆన్‌‌లైన్ ఫోరమ్‌‌ ద్వారా డొమినిక్ పరిచయం చేసుకుని, ఈ దారుణం చేయించాడన్నారు.