ఎదురు కాల్పుల్లో ఒక జవాన్‌ మృతి, మరొకరికి గాయాలు

ఎదురు కాల్పుల్లో ఒక జవాన్‌ మృతి, మరొకరికి గాయాలు

జమ్ము కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఒక జవాన్‌ మృతి చెందాడు. మరొక జవాన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. జిల్లాలోని బిజ్‌ బిహరా పట్టణానికి సమీపంలో ఉన్న మర్హామా సంగం గ్రామంలో భద్రతా బలగాలు.. ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు ప్రారంభించారు.

అయితే కాల్పుల తీవ్రత భారీ స్థాయిలో  జరగడంతో  ఇందులో  ఉగ్రవాదులు కూడా మృతిచెంది ఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఓవైపు ఎన్‌కౌంటర్లు, మరోవైపు ఉగ్రదాడుల హచ్చరికలు, నియంత్రణా రేఖ వెంట పాక్ సైనికుల కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలతో జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అలర్టైన ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా భారీ బలగాలను మొహరించి భద్రతను కట్టుదిట్టం చేసింది.