
హైదరాబాద్, వెలుగు: ఆపద ఏదైనా వెంటనే గుర్తొచ్చేది డయల్ 100. రాష్ర్టంలో ఎమర్జెన్సీ సర్వీస్ కోసం 2013 ఏప్రిల్ 11న డయల్ 100 ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 727 పోలీస్ స్టేషన్లు, 29 పోలీస్ కంట్రోల్ సెంటర్లతో కనెక్ట్ అయ్యింది. ప్రతిరోజు దాదాపు 3 వేల నుంచి 4వేల కాల్స్ వస్తున్నాయి. ఈ ఏడాదిలో నవంబర్ 30 వరకు 11.51లక్షల కాల్స్ వచ్చాయి. గత ఆరేండ్లలో డయల్ 100కు మొత్తంగా55,62,389 కాల్స్ చేశారు. మహిళలపై దాడులు, వేధింపులకు సంబంధించి ఈ ఏడాది నవంబర్ 30 వరకు 1.6 లక్షలు రాగా, ఇందులో గృహహింసకు సంబంధించి 90 వేల కాల్స్ ఉన్నాయి. గత ఆరేండ్లలో వచ్చిన కాల్స్ లో 12 శాతం మహిళలపై దాడులు, వేధింపులవే కావడం విశేషం. మరోవైపు ఉమెన్ హెల్ప్ లైన్ 181కు కూడా కాల్స్ పెరుగుతున్నాయి. మూడేండ్లలో 8,43,524 కాల్స్ వచ్చాయి. గృహహింస, ఆడపిల్లల అమ్మకాలు, వరకట్న వేధింపులకు సంబంధించిన కంప్లయింట్స్ ఎక్కువగా వస్తున్నాయి. గురువారం కొంపల్లిలోని డయల్ 100, 181 సర్వీసెస్ ఆఫీస్ ను సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల హై పవర్ కమిటీ సందర్శించి పనితీరును తెలుసుకుంది.
For More News..