కుంభమేళాలో టెస్టులు చేయకుండానే చేసినట్టు డేటా ఎంట్రీ

కుంభమేళాలో టెస్టులు చేయకుండానే చేసినట్టు డేటా ఎంట్రీ

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఈ మధ్యే నిర్వహించిన కుంభమేళాలో కరోనా టెస్టుల్లో గోల్‌మాల్ జరిగింది. లక్షకు పైగా టెస్టులు ఫేక్ అని తేలింది. టెస్టులు చేయకుండానే చేసినట్టు డేటా ఎంటర్ చేశారని గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేస్తోంది ప్రభుత్వం. కుంభమేళాలో కరోనా టెస్టుల కోసం శాంపిల్స్ కలెక్ట్ చేసే బాధ్యతను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. అయితే ఆ సంస్థ శాంపిల్స్ తీసుకోకుండానే... తప్పుడు పేర్లు, అడ్రస్ లు, ఫోన్ నంబర్లతో  ప్రభుత్వాన్నే బురిడీ కొట్టించింది. ఒకే ఫోన్ నెంబర్ తో 50 మంది పేర్లను ఎంటర్ చేశారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని... త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని కుంభమేళా హెల్త్ ఆఫీసర్ తెలిపారు.