ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్స్​ కోసం లక్ష జాబ్స్‌‌!

ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్స్​ కోసం లక్ష జాబ్స్‌‌!

న్యూఢిల్లీ: దేశంలోని టాప్ త్రీ ఐటీ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష మందికి పైగా ఫ్రెషర్స్​ను నియమించుకోవాలని చూస్తున్నాయి.  ఐటీ సర్వీస్‌‌లకు డిమాండ్ పెరుగుతుండడంతో టీసీఎస్‌‌, ఇన్ఫోసిస్‌‌, విప్రో కంపెనీలు హైరింగ్ యాక్టివిటీని పెంచాయి. టీసీఎస్‌‌ ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌లో 20 వేల మందిని తీసుకుంది. ఇన్ఫోసిస్‌‌ 8,300 మందిని, విప్రో 12 వేల మందిని హైర్‌‌‌‌ చేసుకున్నాయి. కిందటేడాది 40 వేల మంది ఫ్రెషర్స్​కు టీసీఎస్ జాబ్స్ ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా  40 వేలు లేదా అంతకంటే ఎక్కువ మంది ఫ్రెషర్స్​ను నియమించుకుంటామని టీసీఎస్‌‌ పేర్కొంది. ఇన్ఫోసిస్‌‌ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్‌‌గా 35 వేల మందిని నియమించుకుంటామని ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌‌ క్వార్టర్‌‌‌‌లో 10 వేల మంది సీనియర్లను, 2 వేల మంది ఫ్రెషర్స్​ను నియమించుకున్నామని విప్రో ప్రకటించింది. సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో మరో 6 వేల మందిని హైర్ చేసుకోవడానికి కంపెనీ ప్లాన్స్‌‌ వేస్తోంది.  2022–23 నాటికి మొత్తం30 వేల మందికి ఆఫర్ లెటర్స్ అందించాలని చూస్తోంది.