
న్యూఢిల్లీ: కార్ల తయారీ కంపెనీలు మారుతి సుజుకీ, టయోటా కిర్లోస్కర్ మోటర్ తమ వెహికల్స్‌ను రీకాల్ చేస్తున్నాయి. మారుతి తమ పాపులర్ హ్యాచ్‌బ్యాక్‌లు వాగన్ ఆర్, బాలెనోలకు చెందిన1,34,885 యూనిట్లను రీకాల్ చేస్తోంది. పెట్రోల్ పంపులో లోపం ఉన్నందున వీటిని రీకాల్ చేస్తున్నట్టు మారుతి ప్రకటించింది. 2018 నవంబర్ 15 నుంచి 2019 అక్టోబర్ 15 మధ్యలో తయారు చేసిన 56,663 యూనిట్లలో లోపం ఉన్నట్టు కంపెనీ చెప్పింది. అంతేకాక 2019 జనవరి 8 నుంచి నవంబర్ 8 వరకు మాన్యుఫాక్చర్ చేసిన 78,222 బాలెనో యూనిట్లను రీకాల్ చేస్తున్నట్టు తెలిపింది. టాయోటా కూడా తమ గ్లాంజాకు చెందిన 6,500 వెహికల్స్‌ను రీకాల్ చేస్తోంది. మారుతి బాలెనో మాదిరే గ్లాంజాను టయోటా తీసుకొస్తున్న విషయం తెలిసింది. వీటిని కూడా సేమ్ ప్రాబ్లమ్‌తో కంపెనీ రీకాల్ చేస్తోంది. లోపం ఉన్న ఈ భాగాలను ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండానే రీప్లేస్ చేస్తామని ఇరు కంపెనీలు ప్రకటించాయి. పెట్రోల్ పంపులో లోపం ఉన్న ఓనర్లు ఈ విషయాన్ని అథరైజ్డ్ డీలర్స్‌కు తెలపాలని పేర్కొన్నాయి. మారుతి కార్లలో లోపం ఉంటే కంపెనీ వెబ్‌సైట్ www.marutisuzuki.com లో(వాగన్ ఆర్ కోసం) ‘ఇంపార్టెంట్ కస్టమర్ ఇన్ఫో’ సెక్షన్‌ను విజిట్ చేయాలి. బాలెనో కోసం www.nexaexperience.com ను విజిట్ చేయాలని మారుతి పేర్కొంది. ఈ వెబ్‌సైట్లలో వెహికల్ ఛాసిస్ నెంబర్‌ను ఎంటర్ చేయాలని చెప్పింది. గతంలోనూ ఈ కంపెనీ 63,493 యూనిట్ల సియాజ్, ఎర్టిగా వెహికల్స్‌ను రీకాల్ చేసింది.