61మంది మహిళలతో ఎఫైర్: వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

61మంది మహిళలతో ఎఫైర్: వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 61మంది ఆడోళ్లను వంచించాడు ఓ కామాందుడు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో ఓ వక్తి సెల్ ఫోన్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు. అతని షాప్ కు మొబైల్ రిపేర్ కోసం మహిళలు, కాలేజ్ చేస్తున్న యువతులు వచ్చేవారు. వారితో మాటలు కలిపి వాళ్ల వ్యక్తిగత నెంబర్లు తీసుకునేవాడు. తరచూ వాట్స్ అప్ మెసేజ్ లు చేస్తూ దగ్గరై మాటలు కలిపేవాడు. దీంతో పాటే వక్తిగతంగా దగ్గరై శారీరక వాంచ కూడా తీర్చుకున్నాడు. ఏకంగా 61మంది ఆడవాళ్లను వంచించాడు.

సదరు మహిళలతో ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్లకు తెలియకుండా.. వీడియోలు తీశాడు ఆ యువకుడు. ఆ వీడియోలను తన కొందరి ఫ్రెండ్స్ కు చూపెట్టగా..  ఆ వీడియోలు లీక్ అయ్యాయి. దీంతో అతని కామక్రీడలు బయటకు పొక్కాయి. అతని నుంచి వీడియోలను వేరే అతను దొంగిలించి మనీని డిమాండ్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.