రైలు కిందపడి ఒకరు సూసైడ్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రైల్వే స్టేషన్ లో ఘటన

రైలు కిందపడి ఒకరు సూసైడ్    సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రైల్వే స్టేషన్ లో ఘటన
  • జారిపడి మరొకరికి తీవ్ర గాయాలు 

జహీరాబాద్, వెలుగు : రైలు కిందపడి ఒకరు సూసైడ్ చేసుకోగా.. మరొకరు జారిపడి తీవ్రంగా గాయపడిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన ప్రకారం.. ఝరాసంగం మండలం ప్యాలారం గ్రామానికి చెందిన తెనుగు నర్సింలు(59), కొన్నాళ్లుగా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. చికిత్స చేయించుకుంటున్నా తగ్గడం లేదు. 

ఆ బాధ భరించలేక జీవితంపై విరక్తితో మంగళవారం షిర్డీ నుంచి తిరుపతి వెళ్లే రైలు జహీరాబాద్ స్టేషన్ కు వస్తుండగా పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా అదే రైలులో వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన అనిల్ అనే ప్రయాణికుడు ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించి, హైదరాబాద్​లోని ఉస్మానియాకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం నరసింహులు డెడ్ బాడీకి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.