
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో టెర్రరిస్టులకు భద్రతా దళాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టుబెట్టాయి. ఈ ఘటనలో ఓ జవాన్ కూడా మృతి చెందాడని, మరో సైనికుడికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. వాంగమ్ ఏరియాలో శనివారం రాత్రి భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో వారిపై టెర్రరిస్టులు కాల్పులకు దిగారు. దీంతో సెక్యూరిటీ ఫోర్సెస్ ఎదురు కాల్పులు చేశాయి. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని సమాచారం.