త్వరలో వెయ్యి ఖేలో సెంటర్లు.. రిటైర్డు అథ్లెట్లకు ఉపాధి

త్వరలో వెయ్యి ఖేలో సెంటర్లు.. రిటైర్డు అథ్లెట్లకు ఉపాధి

కేంద్ర క్రీడల శాఖా మంత్రి కిరణ్ రిజిజు

న్యూఢిల్లీ: రిటైర్డ్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌ పర్సన్‌‌‌‌కు ఎంప్లాయ్‌‌‌‌మెంట్‌‌‌‌ కల్పించే దిశగా.. దేశ వ్యాప్తంగా వెయ్యి ఖేలో ఇండియా సెంటర్స్‌‌‌‌ను ఓపెన్‌‌‌‌ చేయనున్నామని సెంట్రల్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌ కిరణ్‌‌‌‌ రిజిజు వెల్లడించారు. కంట్రీలో స్పోర్ట్స్‌‌‌‌ కల్చర్‌‌‌‌ను మరింత డెవలప్‌‌‌‌ చేసే విధంగా ఈ సెంటర్స్‌‌‌‌ పని చేస్తాయన్నారు. ‘రిటైర్డ్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌ పర్సన్స్‌‌‌‌కు ఉపాధి చూపించే బాధ్యత మనపై కూడా ఉంది. అందుకే చిన్న స్థాయి ఖేలో ఇండియా సెంటర్స్‌‌‌‌ను వెయ్యి వరకు ఏర్పాటు చేస్తున్నాం. స్పోర్ట్స్‌‌‌‌ పర్సన్‌‌‌‌ సఫర్‌‌‌‌ అయితే యంగర్‌‌‌‌ జనరేషన్స్‌‌‌‌కు డిస్కరేజ్‌‌‌‌ మాదిరిగా అనిపిస్తుంది. అథ్లెట్లకు ప్రైజ్‌‌‌‌మనీ, ఫైనాన్షియల్‌‌‌‌ సపోర్ట్‌‌‌‌ ఇచ్చేందుకు కూడా గవర్నమెంట్‌‌‌‌ సిద్ధంగా ఉంది. సిటిజెన్‌‌‌‌ ప్రో స్పోర్ట్స్‌‌‌‌– ప్రో ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌’కు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాం. దేశంలో స్పోర్టింగ్‌‌‌‌ ఎరెనాను ఏర్పాటు చేసిన తర్వాత దీని గురించి మాట్లాడుతా’ అని రిజిజు పేర్కొన్నారు. స్పోర్ట్‌‌‌‌ లవింగ్‌‌‌‌ సొసైటీలను క్రియేట్‌‌‌‌ చేసేందుకు కార్పొరేట్‌‌‌‌ హౌజెస్‌‌‌‌ ముందుకు రావాలని మినిస్టర్‌‌‌‌ పిలుపునిచ్చారు. ఈ విషయంలో గవర్నమెంట్‌‌‌‌ సపోర్ట్‌‌‌‌లో ఎలాంటి కొరత లేదు. అయితే ఇలాంటి పెద్ద ప్రోగ్రామ్స్‌‌‌‌ను ఏర్పాటు చేసేందుకు గవర్నమెంట్‌‌‌‌ ఒక్క టే ముందుకొస్తే సరిపోదని, ప్రజల సహకారం, చేయూత, పార్టిసిపేషన్‌‌‌‌ చాలా అవసరమని రిజిజు వెల్లడించారు.