పారిశ్రామిక వాడకు భూములిచ్చిన రైతులకు ఒకేసారి పరిహారం

పారిశ్రామిక వాడకు భూములిచ్చిన  రైతులకు ఒకేసారి పరిహారం

    వికారాబాద్​ కలెక్టర్​ ప్రతీక్​ జైన్​ 

వికారాబాద్​, వెలుగు:  పారిశ్రామిక వాడకు భూములను ఇచ్చేందుకు సమ్మతించిన  రైతులకు నష్ట పరిహారాన్ని  ఒకే దఫా అందజేస్తామని  వికారాబాద్​ కలెక్టర్  ప్రతీక్ జైన్​ తెలిపారు. గురువారం కలెక్టరేట్ లోని  లగచర్ల  రైతులతో కలెక్టర్ చర్చించారు. ఆయన మాట్లాడుతూ రైతులకు నష్ట పరిహారపు చెక్కులతో పాటు ఇంటి స్థలాలను కేటాయిస్తామన్నారు. 

 లగచర్లలోని సర్వే నెంబర్ 102లో 36 మంది రైతులకు  58  ఎకరాలు ఉందని,  ఇది ఇవ్వడానికి దీనిపై రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. వీరికి ఎకరానికి రూ.20 లక్షలు ఇస్తామని, 150 గజాల ఇంటి స్థలంలో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని,  అర్హత మేరకు ఇంటికో ఉద్యోగం కల్పించనున్నట్లు  తెలిపారు. అడిషనల్​  కలెక్టర్ లింగ్యా నాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్,  టిజిఐఐసి జోనల్ మేనేజర్ శారద,  అసిస్టెంట్ జోనల్ మేనేజర్ అజీమ సుల్తానా, దుద్యాల తహసీల్దార్ కిషన్, తదితరులుపాల్గొన్నారు.