ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదగిరిగుట్ట, వెలుగు : హామీలు నెరవేర్చడంతో పాటు, ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ ప్యాకేజీ ఇవ్వాలని బస్వాపురం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ వద్ద లప్పానాయక్‌‌‌‌‌‌‌‌ తండావాసులు చేస్తున్న దీక్షలు శనివారంతో తొమ్మిదో రోజుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు మొదట్లో ఇచ్చిన హామీ ప్రకారం దాతరుపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌ 294లో రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిలో ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. అలాగే రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ కోసం తీసుకున్న భూములకు ఎకరానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌‌‌‌‌‌‌‌ ధీరావత్‌‌‌‌‌‌‌‌ బుజ్జి శంకర్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌, ఉపసర్పంచ్‌‌‌‌‌‌‌‌ మంగ్యానాయక్‌‌‌‌‌‌‌‌, మాజీ సర్పంచ్ గాశీరాం, నిర్వాసితులు రవికాంత్, భారతి, లక్ష్మీ, బలరాం, భద్రు, తారాసింగ్, హీరమాన్‌‌‌‌‌‌‌‌, భీమ్లా పాల్గొన్నారు.

దళారులను నమ్మి మోసపోవద్దు

తుంగతుర్తి, వెలుగు : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ సూచించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, తండ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు క్వాలిటీ వడ్లు తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని చెప్పారు. అనంతరం తిరుమలగిరికి చెందిన గబ్బేట అంజయ్య ఇటీవల చనిపోవడంతో ఆ ఫ్యామిలీని పరామర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్‌‌‌‌‌‌‌‌ ఎన్.శాతావాహనరావు, ఎంపీపీ నెమరుగొమ్ముల స్నేహలత, జడ్పీటీసీ దూపటి అంజలి, పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ పాలేపు చంద్రశేఖర్, ఏపీఎం సైదయ్య, సీసీ విజయలక్ష్మి, ఏవో వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు తిరుమణి యాదగిరి, కొమ్మినేని సతీశ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

బోధన మారితేనే విద్యావ్యవస్థలో మార్పు

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : బోధనలో మార్పు వస్తేనే విద్యా వ్యవస్థలో మార్పు సాధ్యం అవుతుందని  నల్గొండ డీఈవో బొల్లారం భిక్షపతి చెప్పారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా శనివారం నల్గొండలో నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మండల నోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు, ఎంఈవోలు తమ పరిధిలోని స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేసి బోధన, అభ్యసన పద్ధతులను పరిశీలించాలని ఆదేశించారు. చదువులో వెనుకబడిన స్టూడెంట్లు సైతం కనీస సామర్థ్యాలు సాధించేలా టీచర్లు కృషి చేయాలన్నారు. సమావేశంలో సమగ్ర శిక్ష క్వాలిటీ కో ఆర్డినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రామచంద్రయ్య, వీరయ్య, వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

మునుగోడులో 20 వేల మెజార్టీతో గెలుస్తాం

యాదగిరిగుట్ట, వెలుగు : మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి 20 వేల మెజార్టీతో గెలవడం ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌రావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్నేళ్ల నుంచి ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు, రిజల్ట్‌‌‌‌‌‌‌‌కు ఒక రోజు ముందు నారసింహుడిని దర్శించుకుంటానని చెప్పారు. అంతకుముందు ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అద్దాల మండపంలో వేదాశీర్వచనం చేసి, స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు. ఆయన వెంట నాయకుడు కాంటేకార్‌‌‌‌‌‌‌‌ పవన్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు. 

నకిరేకల్ సాయి మందిరంలో లక్ష దీపోత్సవం

నకిరేకల్, వెలుగు : షిర్డీ సాయి బాబా ట్రస్ట్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా నకిరేకల్‌‌‌‌‌‌‌‌ పట్టణంలోని సాయి మందిరంలో శనివారం రాత్రి లక్ష దీపోత్సవం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి, తులసి, ఉసిరి పూజలు, రుద్రాభిషేకం అష్టోత్తర పూజలు జరిపారు. మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నకిరేకల్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ రాచకొండ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, ట్రస్ట్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ కాసం లింగయ్య ఉపాధ్యక్షుడు యాట మధుసూదన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బొల్లం సత్తయ్య, ట్రెజరర్‌‌‌‌‌‌‌‌ ముప్పారపు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

రోడ్డు రిపేర్లు చేయాలని గ్రామస్తుల ధర్నా

నేరేడుచర్ల (పాలకవీడు), వెలుగు : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్‌‌‌‌‌‌‌‌పహాడ్‌‌‌‌‌‌‌‌ దర్గా – శూన్యపహాడ్‌‌‌‌‌‌‌‌ రోడ్డుకు రిపేర్లు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ శనివారం శూన్యపహాడ్‌‌‌‌‌‌‌‌ గ్రామస్తులు, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు మూసీ బ్రిడ్జిపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏండ్ల తరబడి రోడ్డుకు రిపేర్లు చేయకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల టైంలో వచ్చే లీడర్లు రోడ్డు వేయిస్తాం, బ్రిడ్జికి రిపేర్‌‌‌‌‌‌‌‌ చేయిస్తామని చెబుతున్నారు గానీ తర్వాత పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రామస్తుల ధర్నాతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. 

జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు

యాదగిరిగుట్ట/దేవరకొండ, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న రాహుల్‌‌‌‌‌‌‌‌గాంధీ జోడో యాత్రకు శనివారం ఉమ్మడి నల్గొండ జిల్లా లీడర్లు హాజరయ్యారు. పీసీసీ సభ్యుడు, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి బీర్ల అయిలయ్య, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌గాంధీని కలిసి జోడోయాత్రలో పాల్గొన్నారు. వారి వెంట కాంగ్రెస్ యాదగిరిగుట్ట మండలం అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, ఎంపీపీలు చీర శ్రీశైలం, గంధమల్ల అశోక్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, సిరాజ్‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌, కొర్ర రాంసింగ్‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌, నర్సిరెడ్డి ఉన్నారు.

ఉమ్మడి జిల్లావాసులకు డాక్టరేట్‌‌‌‌‌‌‌‌

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌/కోదాడ, వెలుగు : యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది. యాదాద్రి జిల్లా సంస్థాన్‌‌‌‌‌‌‌‌నారాయణపురం మండలం జనగాంకు చెందిన ఓయూ జేఏసీ అధికార ప్రతినిధి లింగస్వామి ‘హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నగరంలోని బాలానగర్‌‌‌‌‌‌‌‌, జీడిమెట్ల, కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి పారిశ్రామిక వాడలు, చుట్టుప్రక్కల  ప్రాంతాల్లో భూగర్భ జల కాలుష్యం’ అంశంపై ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌ సక్సేనా పర్యవేక్షణలో పరిశోధన చేశారు. అలాగే సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని మంగల్‌తండాకు చెందిన ధరావత్‌‌‌‌‌‌‌‌ రవీందర్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌ వీసీ రవీందర్‌‌‌‌‌‌‌‌ పర్యవేక్షణలో ‘స్ట్రక్చరల్‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రికల్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ మ్యాగ్నటిక్‌‌‌‌‌‌‌‌ ప్రాపర్టీస్ స్టడీస్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ లిథియం- మెగ్నీషియం, లిథియం- క్రోమియం నానో ఫెరిత్రోస్‌‌‌‌‌‌‌‌’ అనే అంశంపై పరిశోధన చేశారు. దీంతో వీరికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్‌‌‌‌‌‌‌‌ అందజేసింది. ఈ సందర్భంగా వారిని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అభినందించారు. 

9న సూర్యాపేటలో జాబ్‌‌‌‌‌‌‌‌మేళా

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేటలోని  ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఈ నెల 9న జాబ్‌‌‌‌‌‌‌‌మేళా నిర్వహించనున్నట్లు ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ మాధవరెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి నుంచి ఎంబీఏ వరకు చదివి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న వారు జాబ్‌‌‌‌‌‌‌‌మేళాకు హాజరుకావాలని సూచించారు. నిరుద్యోగ యువతీ, యువకులు జాబ్‌‌‌‌‌‌‌‌మేళాను వినియోగించుకోవాలని చెప్పారు. అర్హత గల వారు ఒరిజినల్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్స్‌‌‌‌‌‌‌‌, ఒక సెట్‌‌‌‌‌‌‌‌ జీరాక్స్‌‌‌‌‌‌‌‌, పాస్‌‌‌‌‌‌‌‌ఫొటోతో ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు రావాలన్నారు. వివరాల కోసం 95733 81973, 79955 45407, 92466 18430, 70368 62017 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి

దేవరకొండ, వెలుగు : కేంద్రం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా దేవరకొండలో శనివారం జరిగిన ఏఐటీయూసీ 9వ మహాసభలో ఆయన మాట్లాడారు. కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను కేంద్రం కాలరాస్తోందన్నారు. తమ హక్కులు కాపాడుకునేందుకు కార్మికులు ఐక్యంగా పోరాటం చేయాలని సూచించారు. కార్యక్రమంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్‌‌‌‌‌‌‌‌ అంజయ్య నాయక్‌‌‌‌‌‌‌‌, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, వల్లమల్ల ఆంజనేయులు, జూలూరు వెంకట్‌‌‌‌‌‌‌‌రాములు, ఎల్లయ్య, నీల వెంకటయ్య పాల్గొన్నారు.

వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేసుకోవాలి

సూర్యాపేట, వెలుగు : చిన్నపిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయించాలని సూర్యాపేట డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో కోట చలం సూచించారు. డిఫ్తీరియా, టెటానస్‌‌‌‌‌‌‌‌ వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌పై శనివారం హెల్త్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లతో కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. 10 నుంచి 16 ఏండ్ల మధ్య ఉన్న స్టూడెంట్లు వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సామూహిక వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌ కార్యక్రమంలో భాగంగా 1,101 ప్రభుత్వ, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ స్కూల్స్‌‌‌‌‌‌‌‌లోని 37,516 మంది స్టూడెంట్లకు ఈ నెల 7 నుంచి 17 వరకు ఫ్రీగా వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ వేయనున్నట్లు చెపిపారు. సమావేశంలో డీఈవో అశోక్, బీసీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ అనసూర్య్‌‌‌‌‌‌‌‌, ఎస్సీ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ దయానంద రాణి, ట్రైబల్‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ శంకర్, సంక్షేమ శాఖ అధికారిణి జ్యోతి పద్మ, డీపీఆర్‌‌‌‌‌‌‌‌వో రమేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

భద్రాద్రి బాలోత్సవాన్ని సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయండి

సూర్యాపేట, వెలుగు : ఉత్తమ ఉపాధ్యాయుల అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ఈ నెల 12, 13,14 తేదీల్లో భద్రాచలంలో  నిర్వహించే  ఆట బాలోత్సవాన్ని సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలని రాజ్య సభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌‌‌‌‌‌‌‌ కోరారు. సూర్యాపేటలో శనివారం బాలోత్సవం పోస్టర్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించి మాట్లాడారు. స్టూడెంట్లకు ఎస్సే రైటింగ్‌‌‌‌‌‌‌‌, హాస్య కథల పోటీ, కూచిపూడి, భరతనాట్యం, పేరిణి, జానపదం, నాటికలు, డ్యాన్స్‌‌‌‌‌‌‌‌, ఫ్యాన్సీ డ్రెస్‌‌‌‌‌‌‌‌ కాంపిటీషన్‌‌‌‌‌‌‌‌, మట్టితో బొమ్మల తయారీ వంటి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్టూడెంట్లలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ ఉత్సవాలు ఉపయోగపడుతాయన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌‌‌‌‌ నిమ్మల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, ఉత్తమ ఉపాధ్యాయుల అసోసియేషన్  ప్రధాన కార్యదర్శి నూక వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు రాజా, నాయకులు గుడిపూడి వెంకటేశ్వరరావు, బడుగుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

రేపటి నుంచి నరసింహపురంలో కబడ్డీ పోటీలు

మునగాల, వెలుగు : సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహపురంలో కోదండరామస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా సోమవారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు న్యూ జనరేషన్‌‌‌‌‌‌‌‌ యూత్‌‌‌‌‌‌‌‌ సభ్యులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు 10వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. అలాగే 11 తేదీ రాత్రి జిల్లా స్థాయిలో డ్యాన్స్‌‌‌‌‌‌‌‌ బేబీ డ్యాన్స్‌‌‌‌‌‌‌‌ పోటీలు కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీల్లో క్రీడాకారులు, కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

స్టాఫ్‌‌‌‌‌‌‌‌రూంలో పేలిన టీచర్‌‌‌‌‌‌‌‌ సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌

దేవరకొండ, వెలుగు : దేవరకొండలోని గర్ల్స్‌‌‌‌‌‌‌‌ హైస్కూల్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ రూంలో శనివారం ఓ టీచర్‌‌‌‌‌‌‌‌ సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ పేలింది. వివరాల్లోకి వెళ్తే... స్కూల్‌‌‌‌‌‌‌‌లో ఉదయం ప్రార్థన ముగిసిన అనంతరం భాగ్య అనే టీచర్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌రూంకు వెళ్లి తన హ్యాండ్‌‌‌‌‌‌‌‌ బ్యాగ్‌‌‌‌‌‌‌‌ను టేబుల్‌‌‌‌‌‌‌‌ మీద పెట్టింది. బ్యాగ్‌‌‌‌‌‌‌‌లోని సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ నుంచి పొగలు వస్తుండడాన్ని గమనించి వెంటనే ఫోన్‌‌‌‌‌‌‌‌ను పక్కన పడేసింది. దీంతో అది పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

పేదల రాజ్యాధికారమే లక్ష్యం

మిర్యాలగూడ, వెలుగు : పేదలు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వస్కుల మట్టయ్య చెప్పారు. ఈ నెల 12 నుంచి 15 వరకు బీహార్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించనున్న జాతీయ మహాసభలను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శనివారం బైక్‌‌‌‌‌‌‌‌ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి, మద్దికాయల ఓంకార్‌‌‌‌‌‌‌‌ ఆశయాలను సాధిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంసీపీఐ నాయకులు గోపి, కాశీ, మోన్‌‌‌‌‌‌‌‌నాయక్, రామచంద్రయ్య, మురళీ, కార్తీక్, కాశయ్య, బంగారి, కొండల్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

స్టాఫ్‌‌‌‌‌‌‌‌రూంలో పేలిన టీచర్‌‌‌‌‌‌‌‌ సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌

దేవరకొండ, వెలుగు : దేవరకొండలోని గర్ల్స్‌‌‌‌‌‌‌‌ హైస్కూల్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ రూంలో శనివారం ఓ టీచర్‌‌‌‌‌‌‌‌ సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ పేలింది. వివరాల్లోకి వెళ్తే... స్కూల్‌‌‌‌‌‌‌‌లో ఉదయం ప్రార్థన ముగిసిన అనంతరం భాగ్య అనే టీచర్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌రూంకు వెళ్లి తన హ్యాండ్‌‌‌‌‌‌‌‌ బ్యాగ్‌‌‌‌‌‌‌‌ను టేబుల్‌‌‌‌‌‌‌‌ మీద పెట్టింది. బ్యాగ్‌‌‌‌‌‌‌‌లోని సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ నుంచి పొగలు వస్తుండడాన్ని గమనించి వెంటనే ఫోన్‌‌‌‌‌‌‌‌ను పక్కన పడేసింది. దీంతో అది పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.